ఏపీ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కళింగపట్నం వద్ద రెండు రోజుల పాటు బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు ఏర్పాట్లు ము మ్మరం చేశారు. ఈ నెల 18,19తేదీల్లో ఈ ఫెస్టివల్‌ను భారీ ఎత్తున నిర్వహణకు కసరత్తు జరుగుతోంది. ఏటా రాష్ట్ర ప్రభుత్వం కార్తీకమాసంలో బీచ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తోంది. ఈ ఏడాది పోర్టు కళింగపట్నం విశాల సముద్రతీరం వద్ద పెద్ద ఎత్తున పలు ఆధ్యాత్మిక, సాంస్కృ తిక కార్యక్రమాల నిర్వహణకు నిర్ణయిం చారు. ఈ ఉత్సవంలో రాజ స్థానీ ఫోక్ డ్యాన్సులు, రేలారేరేలా, థిం సా, కోలాటం, తప్పెటగుళ్లు, రోబో డ్యాన్స్, మిమిక్రీ, మ్యాజిక్ షో, సినీ సంగీత విభా వరి తదితర కార్యక్రమాలు నిర్వహించ నున్నారు. ఉదయం సముద్ర తీరంలో బీచ్ వాలీబాల్, కబడ్డీ పోటీలసు క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగ, సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు జరగనున్న ఈ బీచ్ ఫెస్టివల్‌లో మొత్తం పది ఫుడ్, ఇతర స్టాళ్లు ఏర్పాటు చేయ గా, ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తు న్నారు.