కేవలం తనదైన పంచ్‌ల వర్షంతో ఎంటర్టైన్‌మెంట్ ప్రేక్షకులను తన వైపు తిప్పుకుని, అంతేకాక, టాప్ రేటింగ్స్‌తో దూసుకు పోతున్న జబర్దస్త్‌తో అతి తక్కువ కాలంలో తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా సంపాదించుకున్నాడు హైపర్ ఆది. కేవలం ఆది పంచ్ డైలాగ్‌లు చూసి నవ్వుకోవడం కోసమే జబర్దస్త్ చూసే వాళ్లు కూడా ఉన్నారంటే అతిశయోక్తి లేదు. బజర్దస్త్ షోలో మిగతా పాటిస్పెంట్ల సంగతి ఎలా ఉన్నా.. హైపర్ ఆది స్కిట్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే వారు లేరనడం అతిశయోక్తి కాదు.
అలాగే, సినిమా రివ్యూల స్పెషలిస్ట్‌గా పేరొంది.. ఈ మధ్య జరిగిన బిగ్‌బాస్ షో పాటిస్పెంట్‌గా గుర్తింపు పొందిన మహేష్ కత్తి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు యాంటీగా మారిన విషయం తెలిసిందే. అయితే, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణం. అంతేకాదు బిగ్‌బాస్ షోలో పాటిస్పేట్ చేయడంకంటే.. పవర్ స్టార్ పవణ్ కల్యాణ్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతోనే మహేష్ కత్తికి ఎక్కువ గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు. దీంతో పవన్ ఫ్యాన్స్ మహేశ్ కత్తిని.. ఇంటా బయటా సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకున్నారు.. అయినా వెరవకుండా మహేశ్ కత్తి తన విమర్శలను పవన్ పై చేస్తూనే ఉన్నాడు.
ఈ నేపథ్యంలో హైపర్ ఆది తనదైన శైలిలో కత్తి మహేష్‌పై పంచ్ డైలాగ్‌ల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. కాగా, ఈ నెల 9న ఓ ప్రసారం కాబోతున్న జబర్దస్త్ షో ప్రోమో వీడియో విడుదల చేసింది ఆ ఛానెల్. ఈ వీడియోలో కత్తి మహేష్‌పై.. హైపర్ ఆది ఓ రేంజ్‌లో పంచ్ డైలాగ్‌లతో రెచ్చిపోయాడు. “సిక్స్-ప్యాక్ చేయడం సినిమాతీయడం లాంటిది, అది చాల కష్టమైన పని. కానీ రివ్యూ రాయడం ఈజీ, పొట్ట-బట్ట ఉన్న ప్రతి వాడు రాసేస్తాడు” అని ఛలోక్తులేసాడు హైపర్ కమెడియన్. రాబోవు జబర్దస్త్ ప్రచారం కాబోయే స్కిట్ లోని ఆ డైలాగును టీవీ లో ప్రచారం చేస్తున్నారు. మరి ఈ పంచ్ కు కత్తి ఎలా స్పందిస్తారో చూడాలి.