గత కొద్దిరోజులుగా జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు చాలా అర్ధవంతంగా జరుగుతున్నాయి .అందులో భాగంగా నిన్న సోమవారం శాసనమండలిలో మంత్రి కేటీరామారావు కాంగ్రెస్ ఎల్పీ నేత షబ్బీర్ అలీకి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు .నిన్న మండలిలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ “గతంలో ఇంటి నుండి అరగంటలో అసెంబ్లీకి వచ్చేవాళ్ళం .
కానీ ఇప్పుడు గంటకుపైగా సమయం పడుతుంది .హైదరాబాద్ మహానగరంలో రోడ్లు అంత తీవ్రంగా దెబ్బ తిన్నాయి .ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు .వారికోసం కాకుండా త్వరలో నగరానికి రానున్న ట్రంప్ కూతురు ,ప్రధాన మంత్రి నరేందర్ మోదీ కోసమన్నా బాగుచేయించండి అని వ్యంగాస్త్రాలు సందించారు .
దీనికి మంత్రి కేటీ రామారావు స్పందిస్తూ యాబై యేండ్ల పాలనలో నగరంలో డ్రైనేజీ వ్యవస్థను కూడా సరిగా నిర్వహించలేని కాంగ్రెస్ నేతలు చెబితే నేర్చుకునే స్థాయిలో తాము లేమన్నారు .నగరంలో రోడ్లను భారీ వ్యయంతో బాగుచేస్తున్నాము .మూసీ ,రోడ్ల అభివృద్ధికి రూ వెయ్యి కోట్లకు పైగా నిధులు కేటాయించాం .స్ట్రాటజీక్ రోడ్ డెవలప్ మెంట్ కింద ఇప్పటికే 1894కోట్లతో పనులు చేపట్టనున్నాం అని వివరించారు .కాంగ్రెస్ నేతలు సందించిన విమర్శలకు సమాధానం ఇస్తున్న తరుణంలో ఆ పార్టీ నేతలు ఏదో అనడంతో రన్నింగ్ కామెంటరీకి ఇదేమన్న క్రికెట్ మ్యాచా అంటూ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు .