మరాఠీ భాషలో తెరకెక్కిన సైరత్ మూవీ బాక్సాపీస్ వద్ద రికార్డులను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. కొత్త నటీనటులు ఆకాశ్ తోసర్, రింకూ రాజ్‌గుర హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రానికి నాగర్ మంజులే దర్శకత్వం వహిచారు. కేవలం రూ. 4 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం దాదాపు వంద కోట్లను వసూలు చేసి రికార్డు సృష్టించింది.
ఇక బాలీవుడ్ స్టార్స్ అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, కరణ్ జోహార్‌ల మనసు దోచుకుందీ సినిమా. అయితే ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్ కానుంది. సైరాట్ చిత్ర రీమేక్ ద్వారా నటి శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి బాలీవుడ్ రంగప్రవేశంచేయనుంది. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ హీరోగా నటించనున్నాడు. బద్రినాథ్ కీ దుల్హానియా చిత్ర దర్శకుడు శశాంక్ ఖైతాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. చాలారోజులుగా చర్చలు జరిపిన అనంతరం తాజాగా ఫైనల్ చేశారని బీటౌన్ వర్గీయులు చర్చించుకుంటున్నారు.