Home / ANDHRAPRADESH / జ‌గ‌న్ పాద‌యాత్ర‌.. తొలిరోజు ఎంత నడిచారంటే..?

జ‌గ‌న్ పాద‌యాత్ర‌.. తొలిరోజు ఎంత నడిచారంటే..?

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. ఇడుపులపాయలో వైఎస్ సమాధికి నివాళులర్పించిన జగన్ ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించారు. ఇడుపులపాయలో ప్రారంభమైన జగన్ యాత్ర ఇచ్ఛాపురం వరకూ దాదాపు మూడు వేల కిలోమీటర్ల మేరకు సాగనుంది.

ఇక తొలిరోజు ఈ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కి ప్ర‌జ‌ల నుండి విశేష స్పంద‌న వ‌చ్చింది. ఇప్పటికే ఆయ‌న దీక్షలు, ఓదార్పు యాత్రల‌తో జ‌నాల్లో విస్తృతంగా ప‌ర్యటించారు. అయితే తొలిరోజు జగన్ పాదయాత్ర ఎన్ని కిలోమీట‌ర్లు సాగిందో తెలుసా… మొత్తం తొలిరోజు 8.9 కిలోమీటర్లు జగన్ పాదయాత్ర చేశారు. ఇడుపులపాయ నుంచి ఈరోజు ఉదయం బయలుదేరిన జగన్ వేలాది మంది కార్యకర్తల మధ్య కొద్దిసేపటి క్రితం వేంపల్లికి చేరుకున్నారు.

మొత్తం 8.9 కిలోమీటర్లు నడిచిన జగన్ ఆయన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెంట్ లో రెస్ట్ తీసుకుంటారు. రాత్రికి వేంపల్లెలో బసచేసే జగన్ రేపు ఉదయం 8.30గంటలకు పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. ఇడెుపుల పాయ నుంచి చెప్పులతోనే పాదయాత్రగా బయలుదేరిన జగన్ బహిరంగ సభ ముగిసిన తర్వాత ప్రత్యేక షూతో పాదయాత్రను ప్రారంభించడం విశేషం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat