ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని వారికి చేరువ అయ్యి.. ప్రజలందరికీ తగిన సహాయాన్ని అందిచడానికి ప్రజాసంకల్పయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. నవంబర్ 6 సోమవారం అట్టహాసంగా మొదలైంది. ఇక పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో జగన్.. టీడీపీ సర్కార్ పాలనని, చంద్రబాబు అండ్ బ్యాచ్ చేస్తున్న అరాచకాల పై బ్లాస్టింగ్ స్పీచ్ ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే జగన్ చేసిన స్పీచ్‌ను హైలెట్ చేస్తూ ఈనాడు సంచలనం ప్రచురించింది. దీంతో ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయనే వాదన రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఇటీవల జగన్ పాదయాత్రకి ముందు రామోజీరావును కలిసి రావడంతోనే రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేగింది. అయితే ఇప్పుడు ఏకంగా ఈనాడు బాబు దిగిపోతేనే జాబు.. అంటూ కథనాన్ని మెయిన్ పేజ్‌లో ప్రచురించడంతో ఏపీ రాజకీయ వర్గాలు మొత్తం షాక్ తిన్నాయి.
ఇక ఎప్పటి నుండో చంద్రబాబుకు అనుకూలంగా ఉండే రామోజీ.. ఇలా జగన్‌కు సపోర్ట్ ఇవ్వడంతో కొంత ఆశ్చర్యం కల్గినా.. ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించేది వైసీపే అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు సర్కార్ పై ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది.. ఇటీవల నంద్యాలలో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిచినా..ఆ గెలుపు ఎలా వచ్చిందో అందరికీ తెలిసిందే.
టీడీపీ సర్కార్ నంద్యాలో అన్ని కోట్లు ఖర్చుపెట్టినా.. వైసీపీ ఓటు బ్యాంక్‌ని టచ్ చేయలేక పోయారు. ఇక ఇలాంటి అనేక సంఘటనల మధ్య చంద్రబాబు పై ఏపీ ప్రజలకి వ్యతిరేకత పెరిగిపోతుంటే.. జగన్‌కి మాత్రం సపోర్ట్ పెరిగిపోతుంది. ఇక పవన్ జనసేనతో వచ్చినా పెద్దగా జనాల్లోకి వెళ్ళలేదు.. మరోవైపు చంద్రబాబు అండ్ టీమ్ చేస్తున్న అరాచకాలతో టీడీపీ పై వ్యతిరేకత పూర్తిగా పెరిగిపోయింది. ఇక అక్కడ నిత్యం జనాల్లో ఉంటూ ప్రజా బాదలు కష్టాలు తెలుసుకుంటూ జగన్ దూసుకుపోతున్నారు. అంతేకాంకుండా జగన్ ఇంతక ముందులా కాంకుండా శత్రువులను సైతం కలుపుకొని పోతూ ముందుకు సాగుతున్నారు. దీంతో ఇప్పటికే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారం వైసీపీదే అని జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని.. రామోజీరావుకు ముందే అర్ధమైందని.. అందుకే జగన్‌కు ఈనాడు సపోర్ట్ చేస్తోందని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ మొదలైంది.