ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రను గ్రాండ్‌గా స్టార్ట్ చేశారు. పాదయాత్రలో భాగంగా.. వైఎస్ ఎస్టేట్ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో జగన్ స్పీచ్‌తో ఆ ప్రాంగణం మొత్తం దద్ధరిల్లి పోయింది. జగన్ తన ప్రసంగంలో చంద్రబాబుపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు.
ఇక జగన్ పాదయాత్ర సందర్భంగా ఇడుపులపాయ మొత్తం కనీ వినీ ఎరుగని రీతిలో జనసంద్రమైంది. అంతే కాకుండా జగన్ పాదయాత్రకు మునుపెన్నడు లేని విధంగా మీడియా కవరేజ్ లభించింది. ఇక మంగళవారం ఈనాడు అయితే ఓ సెన్షేషన్ శీర్షికతో కథనం ప్రచురించి సంచలనం రేపింది. ఎక్కడో మధ్యలో పేజీలో చిన్న సైజ్లో రావాల్సిన వార్త మెయిన్ పేజీ రెండవ పేజీల్లో.. “బాబు దిగిపోతేనే జాబు” అంటూ వార్త ప్రచురించడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
అంతే కాకుండా పాదయాత్ర ప్రారంభిచిన రోజే జగన్‌కు షాక్ అంటూ.. ఆటంకాలు సృష్టించాలన్న టీడీపీ వర్గీయులకీ… అనుకూల మీడియా వారికి ఊహించని షాక్ ఇచ్చింది. ప్యారడైజ్ లీక్స్‌లో కూడా జగన్ పేరు ఉందని నానా యాగి చేస్తున్న ఎల్లో బ్యాచ్‌కి షాక్ ఇస్తూ.. ప్యారడైజ్ పత్రాల లీక్ విషయంలో జగన్ ప్రస్తావన మాత్రమే ఉందని చెప్పి పచ్చ పత్రికలకి నోటి మాటరాకుండా చేసింది. దీంతో ఒక్కసారిగా జగన్‌కు అనుకూలంగా ఈనాడులో కథనం రావడంతో ఏపీ రాజకీయాల్లో కనీవినీ ఎరుగని రీతిలో మార్పులు జరగొచ్చనే చర్చలు మొదలయ్యాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
# # ఇక జగన్ స్పీచ్‌లో హైలెట్స్ ఇవే..!
చంద్రబాబు పాలనలో ఉద్యోగులు సంతోషంగా లేరన్నారు. ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పింఛను విధానం ఏడాది కాలంగా వద్దంటున్నా పట్టించుకోవడం లేదు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెప్పిన హామీనీ గాలికొదిలారు. ప్రజలకు మంచి చేసేందుకు తాను ఎటువంటి ప్రలోభాలకి లోను కానని.. తప్పకుండా అందరికీ మంచి చేస్తానని చెప్పారు.
ఇక ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు చాలా మందికి సొంత ఇళ్ళు లేవని.. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఇంటి స్థలం.. పక్కా గృహం మంజూరు చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు జాబు రావాలంటే బాబు పోవాలన్నదే తమ నినాదం. బాబు హయాంలో గ్రామాల్లో గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక ప్రజాప్రతినిధులకు అధికారాలు పోయి.. జన్మభూమి కమిటీలనే ముఠాలకు అధికారాలు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటాను. ప్రజలకు తోడుగా నిలిచేందుకు పాదయాత్రకు వస్తున్నా. వైఎస్ ఎంత గొప్పవాడో జగన్ కూడా అంత మంచివాడని మీ అందరి చేత అనిపించుకుంటా అని అన్నారు.
చంద్రబాబు సర్కార్ రాజధాని పేరుతో భారీ మాయాజాలమే జరుగుతోందని..ఇప్పటివరకు స్థిరనిర్మాణాలకు ఒక్క ఇటుకైనా వేశారా అని ప్రశ్నించారు. కొత్త సినిమా ఏది విడుదలైనా చంద్రబాబు చూస్తారు. ఆ మేరకు రాజధాని నిర్మిస్తామంటారు. బాహుబలి సినిమా చూసి అందులో సెట్టింగ్‌లా నిర్మించాలంటున్నారు. సింగపూర్, జపాన్.. ఇలా ఏదేశం వెళితే అలా రాజధాని కట్టాలంటారని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో ఏ పని జరిగినా చంద్రబాబు 30 శాతం లంచాలు తీసుకుంటున్నారని.. ఆ నల్లధనంతోనే ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఓటుకు నోటు కేసులో దొరికిపోయారని విమర్శించారు. నీటిపారుదల ప్రాజెక్టులు విషయంలో నాలుగేళ్లలో నయవంచనకు దిగారు. కడపలోనే చిత్రావతి, పైడిపాళెం ప్రాజెక్టులు సమస్యకు అద్దం పడుతున్నాయి.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 85 శాతం పూర్తిచేస్తే.. బాబు 15 శాతం పూర్తిచేయడానికీ ఆపసోపాలు పడుతున్నారు. నాలుగేళ్లలో ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా.. అని ప్రశ్నించారు. ప్రాజెక్టులు కట్టిన వ్యక్తి గొప్పవాడా.. గేట్లు ఎత్తే లస్కర్ గొప్పవాడా.. అంటూ ప్రశ్నించారు. అనంతరం ఆయన 10 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి.. వేంపల్లె శివారులో రాత్రిబసకు ఉపక్రమించారు.