బాహుబలి వంటి సంచలన చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న అనుష్క.. ప్రస్తుతం భాగమతి అనే చిత్రంలో నటిస్తోంది. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి చిత్రాల్లో అనుష్క నటిన అందర్నీ అలరించింది. ఇప్పుడు భాగమతిగా కూడా అనుష్క తన పెర్ ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేయనుందని తెలుస్తుంది. అనుష్క బర్తడే కానుకగా భాగమతి ఫస్ట్-లుక్‌ను చిత్ర యూనిట్ సోమవారం సాయంత్రం విడుదల చేసింది.
ఇక టాలీవుడ్ సినీ సర్కిల్లో రెండు మూడేళ్లుగా నలుగుతున్న గాసిప్ ప్రభాస్ – అనుష్కల పెళ్లి. వీళ్ళిద్దరి మధ్య సీరియస్ ఎఫైర్ నడుస్తోందని..కొత్త.. కొత్త దినుసులు పేర్చి, కొత్తగా తాళింపు పెట్టి వదిలారు. అంతే కాకుండా డిసెంబరులో నిశ్చితార్థం కూడా చేసుకోబోతున్నారని, వీరిద్దరి ప్రేమ ఇక అధికారికమే అని ఉమైర్ సంధు అనే ఓ సినీ విశ్లేషకులు ట్విట్టర్‌లో పోస్టింగ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరి మధ్య రిలేషన్ ఇప్పటికీ ఓ మిస్టరీయే.
అయితే ఇప్పుడు తాజాగా ఈ హాట్ బ్యూటీ ముప్పైఆరు సంవత్సరంలో అడుగుపెడుతోంది. దీంతో అనుష్కకి సెలబ్రటీలు అంతా శుబాకాంక్షలు తెల్పుతుండగా.. సోషల్ మీడియాలో మాత్రం ఓ ఆశక్తికర చర్చ జరుగుతోంది. అసలు విషయం ఏంటంటే ప్రభాస్ పుట్టిన రోజుకి కాస్ట్‌లీ వాచ్ ఇచ్చిన అనుష్కకి ఇప్పుడు ప్రభాస్ స్వీటీకి ఏం గిఫ్ట్ ఇచ్చడో అని చర్చ జరుగుతుండా.. అనుష్కకి బర్త్‌డే గిఫ్ట్‌గా ప్రభాస్ ఖరీదైన డైమండ్ రింగ్ ప్రెజెంట్ చేశాడని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.