ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా రెండో రోజు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం వేంపల్లి నుంచి పాదయాత్ర మొదలు పెట్టారు. అశేషంగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు వెంటరాగా ఈ ఉదయం 9 గంటలకు రెండోరోజు యాత్ర ఆరంభించారు. ఆయనతో ఫొటోలు దిగేందుకు, కరచాలనం చేసేందుకు అభిమానులు ఎగబడ్డారు. జననేతతో మాట్లాడేందుకు భారీగా జనం తరలివచ్చారు. వారందరినీ ఆయన పలకరించారు.
వేంపల్లి క్రాస్ రోడ్డు, వైఎస్ కాలనీ, కడప-పులివెందుల హైవే, సర్వరాజపేట మీదుగా గాలేరు-నగరి కెనాల్ వరకు యాత్ర సాగనుంది. ఈరోజు 12.6 కిలోమీటర్ల మేర వైఎస్ జగన్ పాదయాత్ర చేయనున్నారు. నీలతిమ్మాయిపల్లి సమీపంలోని ఈరోజు యాత్రను ముగించనున్నారు. సోమవారం ఇడుపులపాయ నుంచి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించిన జననేత మొదటిరోజు 8.9 కిలోమీటర్లు నడిచారు. ఉదయం 9 గంటల 47 నిమిషాలకు తొలి అడుగు వేసిన ఆయన రాత్రి 6.40 గంటలకు బసకు చేరుకున్నారు. యాత్ర ప్రారంభం నుంచి రాత్రి ముగిసే దాకా చెరగని చిరునవ్వుతో ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు.