హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు అత్యంత కీలకమైన విద్యుత్ పరీక్ష నెగ్గింది. దీంతో త్వరలోనే పూర్తిస్థాయి ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఎల్అండ్ టీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 20 న నిర్దేశిత మార్గాన్ని సిద్ధం చేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. బేగంపేట, అమీర్ పేట, ఎస్సార్ నగర్ రూట్లో పూర్తిస్థాయి ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. సోమవారం(నవంబర్-6) బేగంపేట నుంచి SR నగర్ రూట్లో కేంద్ర ప్రభుత్వ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్ పెక్టర్ ఆధ్వర్యంలోని టీమ్ మెట్రో రైలు విద్యుత్ పరీక్షలు చేసింది. ఉప్పల్ డిపోలోని సబ్ స్టేషన్ కు ట్రాన్స్ కు చెందిన మెయిన్ సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ నుంచి అందిస్తున్నారు. విద్యుత్ లైన్లను పరిశీలించిన అధికారులు వీటి పనితీరుకు ఓకే చెప్పారు.
