వైసీపీ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే రోజాను ఎన్నికల్లో ఓడించడం పెద్ద కష్టమేమీ కాదని నటి వాణీ విశ్వనాథ్ అంటున్నారు. సోమవారం నాడు ఆమె విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు మీరు సిద్ధమైపోయారని అనుకుంటున్నారన్న ప్రశ్నకు… ఆ విషయం నేను మైండ్‌లో ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను.
ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం పార్టీలో చేరడంపై ఆలోచించేదేమీ లేదు. నేను చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పార్టీలో త్వరలోనే చేరుతాను. వచ్చే ఎన్నికల్లో రోజాను ఓడించగలరా అని ఓ విలేకరి అడుగగా… రోజాను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. అయితే ఈమె వాఖ్యలపై వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. చిత్తూరు జిల్లా నగరిలో రాజకీయంలో రోజా గెలిచింది ఎవరి మీద తెలుసుకోని మాట్లాడు…టీడీపీ సినీయర్ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు మీద ఒక సినీయర్ నాయకుడు వల్ల కాలేదు నీవు ఇంకా టీడీపీలోనే లేవు చంద్రబాబు మాదిరిగా గాలి మాటలు చేబుతున్నావని వైసీపీ ఫ్యాన్స్ అంటున్నారు.