రష్మీ.. చాలా కాలం నుంచినే ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ, జబర్దస్త్ తో ఈమెకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. ఆ టీవీ షోతో దక్కిన గుర్తింపుతో సినిమా అవకాశాలు కూడా పెరిగాయి. ‘గుంటూర్ టాకీస్’సినిమాలో రేష్మీ గ్లామర్ షో సంచలనంగా నిలిచింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడానికి కారణాల్లో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత రేష్మీ ఇమేజ్ ను సొమ్ము చేసుకోవడానికే అన్నట్టుగా కొన్ని సినిమాలు విడుదల అయ్యాయి. అవేవీ నిలబడలేదు..
అంతేకాదు, జబర్దస్త్’ షో కామెడీతో పాటు యాంకర్ రష్మి చిట్టి పొట్టి డ్రెస్సులతో ఆ షోని మరింత హిటేక్కించింది. ఇదిలా ఉంటే… రష్మిగౌతమ్, జబర్దస్త్ కామెడీ షో టీమ్ లీడర్ సుడిగాలి సుధీర్ మధ్య ఎఫైర్ ఉందని కొంతకాలంగా సోషల్ మీడియాలో రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా ‘నెక్స్ట్ నువ్వే’ సినిమాలోనూ ఆమె హాట్ లుక్స్ ఆకట్టుకున్నాయి. ఐతే ఈ సినిమాలో రష్మి చెప్పిన ఓ డైలాగ్ చర్చనీయాంశమైంది. ‘‘నీకు గడ్డివాము దగ్గర కుక్క గురించి తెలుసా.. అది తినదు.. వేరే వాళ్లను తిననివ్వదు’’ అబ్బ.. నొప్పీ.. అంటుంది రష్మి ఈ సినిమాలో.
ట్రైలర్లోనే చర్చనీయాంవమైన ఈ డైలాగ్ సినిమా విడుదలయ్యాక మరింతగా హాట్ టాపిక్ అయింది. రష్మి ఈ డైలాగ్ చెప్పే తీరు.. ఆ సీన్ అభ్యంతరకరంగా ఉన్నాయంటూ కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రష్మి స్పందించింది. ఈ డైలాగులో అశ్లీలత ఏముందని ఆమె ప్రశ్నించింది. తానేమీ ఈ డైలాగ్ చెబుతూ అర్ధ నగ్న దుస్తుల్లో కనిపించలేదని.. పద్ధతిగా చీర కట్టులోనే ఉన్నానని.. దీన్నెందుకు ఇంత వివాదం చేస్తున్నారు.. ఈ డైలాగుకే రభస చేస్తున్నారు అని ప్రశ్నించింది రష్మి. ఈ మధ్య సినిమాల్లో ఇంతకంటే చాలా బూతు సన్నివేశాలు చూపిస్తున్నారని.. అలాంటిది ఒక డైలాగ్ గురించి వివాదాలు రేపడం కరెక్ట్ కాదని రష్మి అంది.