ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిదే. అయితే ప్రజా సంకల్ప యాత్ర స్టార్ట్ అవడానికి ముందు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్దకి చేరుకునే ముందు ఒక ఆశక్తికర ఘటన చోటు చేసుకుంది.
అసలు విషయం ఏంటంటే పాదయాత్ర ప్రారంభానికి ముందు జగన్‌ని ప్రేమతో ముద్దాడారు తల్లి విజయమ్మ. పాదయాత్ర విజయవంతంగా కొనసాగాలని కుమారుడిని ఆశీర్వదించారు. ఆ తర్వాత షర్మిల తన అన్నను ప్రేమతో హత్తుకున్నారు. మీ వెంట మేమున్నామనే భరోసాను కల్పించారు.
మరోవైపు, ఇడుపులపాయ జనసంద్రంగా మారింది. అశేషంగా తరలివచ్చిన వైసీపీ నేతలు, కార్యకర్తలతో ఇడుపులపాయలోని సభాప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా… పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. దీనికితోడు, కాసేపటి క్రితం ఇడుపులపాయలో చిరుజల్లు కురిసింది. ఇది మంచికి సంకేతమంటూ వైసీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి.