మన అచ్చతెలుగు అమ్మాయి.. తెనాలిలో పుట్టి , ముంబైలో పెరిగి, అక్కడే మోడలింగ్ చేసి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది తెలుగు అమ్మాయి శోభిత దూలిపాళ్ల. ప్రస్తుతం గూఢచారి మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి ఈమె ఏంటి వేశ్యగా మారడం అని అనుకుంటున్నారా. ఇదంతా ఓ సినిమా కోసమే లెండి.. తాజాగా ఈమె హిందీ – మలయాళం భాషల్లో మూథోన్ అనే ఓ బై లింగ్వుల్ సినిమాలో నటిస్తుంది.
ఈ మూవీ లో ఈమె వేశ్య పాత్రలో కనిపిస్తుంది..నిజ జీవితం వేశ్య ఎలా ఉంటారు..అసలు వారు వేశ్య గా ఎందుకు మారాల్సి వచ్చిందో తెలుసుకోవడానికి ఆమె పలు నగరాల్లో ఉన్న రెడ్ లైట్ ఏరియాలకి వెళ్లి వేశ్యల జీవితాల్ని పరిశీలించి పరిశోధన చేస్తోందట శోభిత. అయితే సడెన్‌గా ఈమె రెడ్ లైట్ ఏరియాల్లో కనిపించేసరికి అందరూ షాక్ అవుతున్నారట. తీరా ఏంటి అని తెలుసుకున్నాక అవునా అని చర్చించుకుంటున్నారట.