నటుడు రాజశేఖర్ సినిమా హిట్ అయ్యి పుష్కరకాలం అయ్యింది. కొంత కాలంగా ఈ యాంగ్రీ యంగ్ మాన్ నుండి అనేక చెత్త చిత్రాలు వచ్చాయి. దీంతో తెలుగు ప్రేక్షకులు రాజశేఖర్‌ను దాదాపుగా మర్చిపోయారు అనుకుంటుండగా.. గరుడ వేగ చిత్రంతో బంపర్ హిట్ కొట్టాడు. ప్రవీన్ సత్తార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.
ఇక చాలా రోజుల నుండి హిట్ కోసం ఎదురు చూస్తున్న రాజశేఖర్‌కు బంపర్ హిట్ అయితే తగిలింది కానీ రియల్ లైఫ్‌లో మాత్రం ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. మొన్నామధ్యన తల్లిని కోల్పోయిన బాధలో కారు రాష్‌గా డ్రైవ్ చేసి వేరే వ్యక్తి కారుని గుద్దిన రాజశేఖర్ ఆ విషయాన్నీ పెద్దది కాకుండా రాజి కుదర్చడంతో విషయం సద్దుమణిగింది.
ఇంకా ఆ విషయం మరువకముందే రాజేశేఖర్ కూతురు శివాని గత రాత్రి కారు యాక్సిడెంట్ చేసింది. ప్రస్తుతం రాజశేఖర్ గరుడ వెగ విజయంతో కుటుంభం సభ్యులు సంబరాల్లో మునిగితేలుతున్న వేళ శనివారం రాత్రి ఆయన పెద్ద కూతురు శివాని కారు జూబ్లీహిల్స్ దగ్గర అదుపు తప్పి ఆగి ఉన్న కారును ఢీ కొట్టడంతో పోలీసు కేసు నమోదు అయ్యింది.
ఇక శివాని ఢీ కొట్టిన కారు ఒక ఉన్నత కుటుంబానికి చెందిన కారు కావడంతో.. వారు తమ కారుకి నష్టపరిహారం చెల్లించమని గొడవ మొదలు పెట్టారట.వారు తమ కారును ఈమధ్యనే కొన్నామని… కారుకి యాక్సిడెంట్ చేసినందుకు గాను 30 లక్షలు చెల్లించమని గొడవ చేస్తున్నట్టుగా సమాచారం. మరి ఈ విషయం ఎంత దూరం వెళుతుందో చూడాలి. ప్రస్తుతం మెడిసిన్ చదువుతున్న శివాని త్వరలోనే సినీరంగ ప్రవేశం చేయబోయే టైమ్‌లో ఇలా యాక్సిడెంట్ కేసులో ఇరుక్కోవడంతో రాజశేఖర్ దంపతులకు ఏం పాలుపోవడంలేదని సినీ వర్గీయులు చర్చించుకుంటున్నారు.