కాస్టింగ్ కౌచ్.. ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. చిత్ర పరిశ్రమలో ఎదగాలన్నా, అవకాశాలు రావాలన్నా నటీమణులు తమ వాంఛలు తీర్చాలని అడిగేవారు ఉంటారు. ఇలాంటి సమస్యను కాస్టింగ్ కౌచ్ అంటారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది చాలా కామన్. ఈ విషయం గురించి ఇదివరకు నటి రాధికా ఆప్టే చర్చిస్తూ దక్షిణాది పరిశ్రమపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
ఓ సీనియర్ హీరో తనను రాత్రికి రమ్మన్నాడంటూ రాధిక ఆప్టే ఆమధ్య పెద్ద సంచలనమే సృష్టించింది. టాలీవుడ్ సర్వం సమర్పించుకుంటే తప్ప హీరోయిన్ గా రాణించలేరని..టాలీవుడ్లో హీరోలకు.. నిర్మాతలకు.. దర్శకులకు అన్నీ సమర్పించుకుంటే ఛాన్సులు వస్తాయని కన్నడ హీరోయిన్ శృతి హరిహరన్ ఆరోపించిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు తాజాగా దీనిపై శ్రద్ధాదాస్ కూడా తన అభిప్రాయం వెల్లడించింది. పరిశ్రమలో పాడు సంస్కృతి ఉందనే విషయాన్ని అంగీకరించిన శ్రద్ధాదాస్, తన వరకు మాత్రం అది అనుభవంలోకి రాలేదని స్పష్టంచేసింది. నిజానికి మనం ప్రొఫెషనల్ గా ఉంటే అలాంటి వేధింపులు ఉండవంటోంది. తన వరకు తను మాత్రం షూటింగ్ అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్లిపోతానని చిప్పింది.
ఇప్పటివరకు తను టాలీవుడ్లో ఏ ఒక్క హీరోతో పార్టీలో పాల్గొనలేదని, కేవలం సెట్స్ వరకు మాత్రమే అన్నీ పరిమితం చేశానని అంటోంది. అందుకే కాస్టింగ్ కౌచ్ లాంటి ఇబ్బందికర పరిస్థితులు తనకు ఎదురుకాలేదంటోంది శ్రద్ధా దాస్. ఇక ఆమె నటించిన తాజా చిత్రం గరుడవేగ ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా నడుస్తోంది.