ఏపీ రాజకీయాలను శాసించిన దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ బాటలో తనయుడు వైఎస్ జగన్ అడుగులు ప్రారంభించారు. రాష్ట్ర ప్రజల కష్టాలను.. దగ్గరుండి తానే స్వయంగా తెలుసుకునేందుకు వైసీపీ అధినేన జగన్ పాదయాత్రకి పూనుకున్నారు.
ఇక అందులో భాగంగానే జగన్ వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించారు.
జగన్ తన పాదయాత్ర ప్రారంభించే ముందు.. మొదటగా వైఎస్‌ఆర్ ఘాట్‌ను సందర్శించిన జగన్ కుటుంబసభ్యులతో కలిసి.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జనసంద్రమైన ఇడుపులపాయ నుంచి ప్రజలతో మమేకమై.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. జగన్ ప్రసంగంలో చంద్రబాబు చేసిన ఒక మంచి పనిని మెచ్చుకున్నారు.
జగన్ ప్రసంగంలో బాబు గురించి మాట్లాడుతూ.. ఏది ఏమైనా చంద్రబాబు ఒక మంచి పని చేశాడన్నారు. బాబు చేసిన మంచి పని ఏంటంటే..
ఇంగ్లీషు సినిమాలు చూడకపోవడమేనన్నారు. తెలుగు సినిమాలుచూసి అదే సెట్టింగ్ ను ఏపీ అమరావతిలో నిర్మిద్దామంటారు. బాహుబలి తరహా సెట్టింగ్స్‌తో రాజధానిని నిర్మించాలని అంటారన్నారు.
ఇక ఏ దేశానికి పోతే ఆ దేశం చూసి అక్కడిలాగే మన ఏపీ ఉండాలంటారు. జపాన్ జపాన్ లాగా, సింగపూర్ పోతే సింగపూర్ లాగా ఇలా…ఏదేశానికి పోతే ఆ దేశంలా రాజధానిలా తీర్చిదిద్దుతామని డప్పులు కొడతారన్నారు. అయితే అదృవశాత్తూ ఇంగ్లీషు సినిమాలు చూడకపోవడంతో ఏపీ ప్రజలు బతికిపోయారన్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలపై చంద్రబాబు చెప్పేవన్నీ కట్టుకథలేనని జగన్ విమర్శించారు. మొత్తం మీద జగన్ పాదయాత్ర మొదటి రోజు.. తొలి ప్రసంగం ఆకట్టుకుందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.