వైసీపీ అధినేత జగన్ ప్రజల కోసం చేపట్టి పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్రలో చంద్రబాబును ఆడుకునేందుకు జగన్ వద్ద ఎన్నో అస్త్రాలు ఉన్నాయి. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీల్లో సగం కూడా నెరవేరలేదు. రుణమాఫీ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని కొర్రీలు పెడుతుందో చూస్తున్నాం. ఇక సామాన్య ప్రజల నుంచి మహిళల వరకు అందరూ ఇబ్బందులు పడుతున్నారు.
ఇకపోతే ఏపీకీ గత ఎన్నికల టైంలో మోడీ ప్రత్యేకహోదాపై హామీ ఇచ్చారు. ఇప్పుడు హోదా ఇవ్వకుండా నిలువునా దగా చేశారు. ఈ హోదా విషయంలోనే కాదు చంద్రబాబు సర్కార్ ప్రతి విషయంలోను కేంద్ర ప్రభుత్వంతో రాజీపడుతూ ఏపీ ప్రయోజనాలు పణంగా పెడుతోంది. ఇక జగన్ ప్రత్యేక హోదా అంశాన్ని ఎత్తుకున్నా బాబుపై నిప్పులు చెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
అంతేకాకుండా వచ్చే ఎన్నికల టైమ్‌కి ఎలాగూ పోలవరం పూర్తయ్యే పరిస్థితి లేదు. ఇది కూడా జగన్‌కు మంచి అస్త్రమే. ఇక భారీగా పెరిగిపోయిన అవినీతిని బేస్ చేసుకుని కూడా జగన్ చంద్రబాబును విమర్శించవచ్చు. ఏవిధంగా చూసినా.. జగన్ చేపడుతున్న పాదయాత్ర ఇటు ప్రభుత్వానికి, అటు టీడీపీ అధినేతకు కూడా ముచ్చెమటలు పట్టిస్తాయనడంలో సందేహం లేదని అంటున్నారు సీనియర్లు.
ఇక జగన్ తన సొంత స్టైల్‌లో మహిళలను పలకరించడం, సెల్పీలు దిగడం, అవ్వా తాతా అంటూ ఆప్యాయతను కురిపించడం కూడా పాజిటివ్‌గా మారనున్నాయని అంటున్నారు వైసీపీ నేతలు. మరి ఈ పాదయాత్ర జగన్‌కు వచ్చే ఎన్నికల వేళ ఎంత వరకు ప్లస్ అవుతుందో.. జగన్ చేపట్టిన ఈ పాదయాత్ర వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎంతవరకు వైసీపీకి ప్లస్ అవుతుందో చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.