వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రను అశేష జనసంద్రం మధ్య ప్రారంబించారు. జగన్ పాదయాత్ర తొలిరోజు.. తొలి ప్రసంగాన్ని కసితో ప్రారంభించారు. వైయస్సార్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు సర్కార్ చేస్తున్న అరాచకాల పై ద్వజమెత్తారు. అత్యంత ఆశక్తిగా సాగిన ప్రసంగంలో.. జగన్ చంద్రబాబుకు బ్లాస్టిగ్ సవాల్‌ను విసిరారు.
ఇటీవల నంద్యాలలో జరిగిన ఉప ఎన్నికలో రూ. 200 కోట్లు ఖర్చు చేసి టీడీపీ గెలుపొందిందని జగన్ విమర్శించారు. చంద్రబాబుకు దమ్ముంటే, ప్రజల్లో అభిమానం ఉందని ఆయన భావిస్తుంటే… 20 చోట్ల ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. గ్రామాల్లోని జన్మభూమి కమిటీలు దొంగలముఠాలుగా తయారయ్యాయని మండిపడ్డారు.
చంద్రబాబు బ్యాచ్‌ని చూస్తుంటే బాలగంగాధర్ తిలక్ చెప్పిన గాంధీ దేశంలో గజానికొక గాంధారి కొడుకు అనే మాటలు గుర్తుకు వస్తున్నాయని అన్నారు. ప్రస్తుత పాలనలో ప్రజాప్రతినిధులకు అధికారం లేదని… జన్మభూమి కమిటీ దొంగలకే చంద్రబాబు అధికారాలను కట్టబెట్టారని విమర్శించారు. తనకు కాసులంటే కక్కుర్తి లేదని… చంద్రబాబులా కేసులకు భయపడని బహిరంగ సభలో జగన్ అదిరిపోయే స్పీచ్ చేశారు.