త్వరలో జరగనున్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుబీ ఎవరు మోగించనున్నారు. ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ ఆశలు గల్లంతేనా? 1990నాటి ఫలితమే మళ్లీ రిపీట్ కానుందా?.ఈ ఎన్నికలో ప్రజానాడి ఎటువైపు ఉంది? .ఎవరు గెలుస్తారు అనే విషయం మీద తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌కు చెందిన పీపుల్స్ పల్స్ సంస్థ ముందస్తు సర్వే నిర్వహించింది.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ మూడ్ ఎలా ఉంది? ప్రజలు ఏ పార్టీ వైపు చూస్తున్నారు?. కమలం పార్టీకి ప్రజలు అనుకూలంగా ఉన్నారా? .ఇప్పటి వరకు అధికారాన్ని చెలాయిస్తున్న కాంగ్రెస్‌పై ప్రజలు ఏమంటున్నారు?.అని ఇలా అంశాలపై పీపుల్స్ పల్స్ సర్వేనిర్వహించింది.గత అక్టోబర్‌లో నిర్వహించిన సర్వేలో పలు అంశాలు వెల్లడయ్యాయి.
డిమానిటైజేషన్, జీఎస్టీ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కమలం పార్టీకి కస్తా ఎదురుగాలి వీస్తోంది. అయితే హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది . ఆ రాష్ట్రంలో అన్ని వర్గాలు కమలం పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడయింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కమలం పార్టీకి కలిసిరానుంది. హిమాచల్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో కమలంకు 40 వచ్చే అవకాశం ఉందని సర్వేలో వెల్లడయింది. కాంగ్రెస్‌కు కేవలం 20 స్థానాలు వచ్చే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ సర్వే తెలిపింది.