బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్స్ డాటర్స్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి సంబంధించి ఒక హాట్ టాపిక్ జోరుగా నడుస్తోంది. ఏ స్టార్ కూతురు సినిమాల్లోకి వస్తుందో అనే దాని మీద బీ టౌన్ వర్గీయుల్లో కూడా పెద్ద చర్చే నడుస్తుంది. ఎందుకంటే సీనియర్ హీరో హీరోయిన్స్ కూతుళ్లు వయసుకు వచ్చి సినిమాల్లోకి రావడానికి రెడీ అయ్యారు.
ఇక వారిలో శ్రీదేవి కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషి కపూర్, అలాగే షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్, సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ లు ఇలా సినిమాల్లోకి ఎంట్రీ కోసం క్యూ కట్టేశారు. ఈ స్టార్ డాటర్స్ ఎక్కడికి వెళ్లినా మీడియా. వాళ్ళని వెంటాడేస్తుంది. వీరు కూడా పార్టీలు, పబ్బులు, ఫంక్షన్స్ అంటూ ఎప్పటికిపపుడు మీడియాకి ఫోకస్ అవుతూనే ఉన్నారు.
ఇక సోషల్ మీడియాలోనూ ఈ స్టార్ డాటర్స్ గురించిన రచ్చ మాములుగా లేదు. వీరు రెస్టారెంట్ కి వెళ్ళినా సెన్సేషనే.. బ్యూటీ పార్లల్‌కి వెళ్లినా సెన్సేషనే. అయితే ఇటీవల ఈ స్టార్ డాటర్స్ అందరూ బాలీవుడ్ లో దీపికా పదుకొనె ఇచ్చిన ఒక గ్రాండ్ పార్టీకి హాజరయ్యారు. దీపికా పదుకొనె పద్మావతి సినిమాలో నటిస్తుంది. ఇటీవల పద్మావతి ట్రేలర్ రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది.
దీంతో దీపికా పదుకొనె బాలీవుడ్ సెలబ్రిటీస్ అందరికి ఒక గ్రాండ్ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీలో శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. వీళ్ళు బాలీవుడ్ బడా కింగ్ మేకర్ కరణ్ జోహార్ తో, అలాగే రణ్వీర్ సింగ్ లతో కలిసి సెల్ఫీలు దిగుతూ పార్టీలో నానా హంగామా చేశారు. ఇక ఈ పార్టీ అంతటా ఈ స్టార్ డాటర్స్ మీదే నడించిందనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది మ్యాటర్ అయ్యింది.