ఇక్కడ ఎవరు ఎవరినీ తొక్కేయరు.. తొక్కేయబడరు అంటూ రొటీన్ స్టేట్‌మెంట్లు ఇస్తుంటారు సినిమావాళ్లు. అవి విని నిజంగా అది నిజమో ఏమో అనుకుంటాం. కానీ, సరిగ్గా అలాంటి డైలాగ్‌లు చెప్పేటప్పుడే అతివీర భయంకరంగా నటించేస్తున్నారన్న విషయాన్ని గ్రహించలేం.
ఇక్కడ తొక్కేయడం.. అరటిపండు తొక్క తీసి పండు మింగేయడం అన్నంత వీజీ అయిపోయింది. కాస్త పలుకుబడి, ఇంకాస్త క్రేజ్, చేతిలో రెండు హిట్లు ఉంటే చాలు తమకంటే తక్కువ రేంజ్ ఉన్న వాళ్లను తొక్కేసి వాళ్ల జీవితాలతో తొక్కుడు బిళ్ల ఆటాడేసుకుంటారు.
అయితే, పరిశ్రమలో ఇప్పుడు అదే జరుగుతోంది. యువ కథానాయిక అవికా గోర్ విషయంలోనూ ఇదే విషయం రిపీటైంది. ఒకటి రెండు సినిమాలతోనే సౌందర్య నుంచి నిత్యామీనన్ వరకు చాలా మందితో పోల్చారు, ఈ కథానాయికను ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్త మామ సినిమాలను చూస్తే కచ్చితంగా ఏడాదికి ఆరాడేడు సినిమాలు చేసే కెపాసిటీ ఉంది అమ్మడికి అనిపించింది. అయితే, అవికాగోర్ సడెన్‌గా డ్రాప్ అయింది. ఆ మాటకొస్తే తన చేతిలో సినిమానే లేదిప్పుడు దానికి కారణం.. ఆమెకు అవకాశాలు రాక కాదట, వచ్చిన అవకాశాలను కొంతమంది అడ్డుకుంటున్నారట.
అవికా ఎందుకు దండగా.. ఇంకో హీరోయిన్ ఉండగా అంటూ అడ్డుపడుతున్నారట. ఓ బ్యాచ్ అవికాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని, అవికాకు వస్తున్న అవకాశాలను దూరం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు. మొన్నీమధ్య ఓ యువ హీరోతో అవికా గొడవ పెట్టుకుంది. ఆ గొడవతోనే హీరోలు రెండు వర్గాలుగా విడిపోయారు. అవికాకు సపోర్ట్ చేసే వారు కొంతమంది.. అవికాకు వ్యతిరేకంగా మరికొంత మంది విడిపోయారు కూడాను. సపోర్ట్ చేసిన వారంతా ఇప్పుడు సైడ్ అయిపోతే.. నెగిటివ్ అయిన వాళ్లంతా ఇప్పుడు తమ పని తాము కానిచ్చేశారట. అవికాను తీసుకుంటే మేం పనిచేయమంటూ బ్లాక్‌మెయిల్ కూడా చేశారు.
అయితే, అవికా యువహీరోల పక్కనే సెట్ అవడం.. వాళ్లే రెండు గ్రూపులుగా విడిపోవడం. అందుకే నెగిటివ్ ప్రచారం దర్శక నిర్మాతుల కూడా వికాను దూరం పెట్టినట్లు సమాచారం. ఈ గోలంతా భరించలేను అనుకుని తనకొచ్చిన కొన్ని తెలుగు సినిమాల్ని అవికా వదులుకుందని అంటున్నారు. అవికా అప్పుడు కొన్ని సినిమాలను వదులుకున్న మాట నిజమే. అయితే, దానికి కారణం మీరనుకున్నదేదీ కాదు. అవికా వ్యక్తిగత కారణాల వల్ల సినిమాల సంఖ్యను తగ్గించుకుంది. అని అవికా సన్నిహితులు చెబుతున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే. అవికానే నోరు విప్పాలి.