సుచీలీక్స్ బారిన పడిన కోలీవుడ్ భామల్లో ఆండ్రియా జెర్మయ్ ఒకరు. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్లే బాయ్ అయిన అనిరుథ్‌తో చేసిన రొమాన్స్ అంతా సుచీలీక్స్ పేరుతో లీక్ అయిన విషయం తెలిసిందే. ఇక కమల్ హాసన్‌తో విశ్వరూపంలో మెరిసిన ఆండ్రియా.. విశాల్ తాజా చిత్రం తాజాగా డిటెక్టీవ్‌లో నటిస్తోంది. తమిళ్‌లో హిట్ అయిన ఈ చిత్రం తెలుగులో నవంబర్ 10న రిలీజ్ కానుంది.
ఇక ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా.. సోషల్ మీడియాలో సంచలనంగా మారిన హ్యాష్ టాగ్ మీ టూ పై మీ స్పందనేంటని అడుగగా.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇచ్చింది. అమ్మాయిలని బలవంతంగా లైంగిక చర్యలకు లాగటం, అలాగే ఆమె వ్యక్తిగతంగా ఇష్టపడి ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళినప్పుడు మీరెందుకు ఆ విషయాన్ని మళ్ళీ, మళ్ళీ చూడాలని ప్రయత్నిస్తారు అంటూ పంచ్ ఇచ్చింది.
ఓ అమ్మాయి ఎవరితో పడుకుంటుందనేది ఆమె వ్యక్తిగత విషయం. ఆ విషయంపై మరొకరు బలవంతం చేయకూడదు. చేయలేరు కూడా. నా సినీ కెరీర్‌లో నాకు లైంగికంగా ఇబ్బందులకు గురిచేసే సమస్యలు ఎక్కడా ఎదురు కాలేదు. అలాంటి సమస్యలుంటే ఆ సినిమాను వదులుకోవడానికి నేను సిద్ధం అని తేల్చిచెప్పేసింది ఈ ముద్దుగుమ్మ.
ఇటీవల ముద్దు సీన్ల గురించి కూడా ఆమె ఇలానే షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సిద్దార్థ్ సరసన గృహం సినిమాలో నటించిన ఆండ్రియా.. ఈ చిత్ర ట్రైలర్లో చూపించిన లిప్ లాక్స్ గురించి మీడియా వాళ్లు ప్రశ్నించినపుడు అదే రకం అసహనంతో తనదైన శైలిలో బదులిచ్చింది. లిప్ లాక్ సీన్స్ గురించి కేవలం మీడియానే ఇంకా విమర్శనాత్మక కోణంలో చూస్తోందని చెప్పింది.
ఒకసారి రోడ్డు మీదికి వచ్చి చూడండి.. ఈ కాలం యువత ఇలాంటి వాటిని చాలా సహజంగా భావిస్తోంది. లిప్ లాక్ అశ్లీలం, అసభ్యం అనే వాళ్లందరూ నిజ జీవితంలో ముద్దులే పెట్టుకోవట్లేదా.. లిప్ లాక్ సీన్స్ ఉన్నాయని.. దాని గురించి మాట్లాడటం.. నా దృష్టిలో ఓ చెత్త అంటూ గట్టిగానే రిప్లై ఇచ్చింది ఆండ్రియా. అయితే ఈ తరహా మాటలు బాలీవుడ్ లో కాస్త పర్లేదు గానీ మన దక్షిణాది హీరోయిన్లలో ఇలా చెప్పే ధైర్యం తక్కువే.. అని సినీ వర్గీయులు చర్చించుకుంటున్నారు.