బాహుబలి సిరీస్ తరువాత ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సాహో. ఈ మూవీపై దేశ వ్యాప్తంగా బోలెడంత క్రేజ్ ఉంది. పైగా శ్రద్దాకపూర్ లాంటి బాలీవుడ్ భామను హీరోయిన్‌గా తీసుకోవడంతో మరింతగా ఆసక్తి పెరిగింది. రీసెంట్‌గా హైదరాబాద్‌లో సాహో టీమ్ షూటింగ్ ఒక షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇప్పుడు యూనిట్ అంతా కలిసి అబుదాబీ బయల్దేరుతున్నారు.
అబుదాబిలో తప్ప మరే సమాచారం లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు సామో టీమ్ అంతేకాదు, టీమ్ అంతా కలిసి మొబైల్ బ్యాండ్ అనే పాయింట్‌ను స్ర్టిక్ట్‌గా పాటించేస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్ యాంగిల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి చిన్న విషయం కూడా బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్రధాన నటులు, టెక్నీషియన్స్ సహా ఎవరూ సెల్ ఫోన్స్‌ను షూటింగ్ స్పాట్‌కు తీసుకురాకూడదని డిసైడైపోయారు. అంతేకాదు. షూటింగ్ స్పాట్‌లో ఏం జరుగుతుందో ఫోటోల ద్వారా బయటకు లీక్ చేసే ఛాన్స్‌లు లేకుండా చాలానే జాగ్రత్తలు తీసుకుంది సాహో టీమ్.
అయితే, ఇప్పటికే విడుదలైన సాహో టీజర్‌తో పాటు.. మొన్నీ మధ్య విడుదల చేసిన ప్రభాస్ ఫస్ట్ లుక్ సూపర్బ్ అంటున్నారు సినీ జనాలు. ఒక్క మాటలో చెప్పాలంటే సాహో టీజర్ అదిరిపోయింది. డైలాగ్ మాసీగా ఉన్నా, దాన్ని తీసిన విధానం యమ క్లాసీగా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ చూస్తుంటే స్పైడర్ మాన్ బ్యాట్‌మెన్ టైపు సినిమా ఏమో అనిపించకమానదు. సాహో టైటిల్, ప్రభాస్ డైలాగ్, దాన్ని కట్ చేసిన విధానం చూస్తుంటే కచ్చితంగా సాహోభారీ విజయం సాధించడ ఖాయమంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.