నట రుద్రుడు ఎన్టీఆర్ కథానాయకుడుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ చిత్ర పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. పవన్ కల్యాణ్ ముఖ్య అతిధిగా హాజరై క్లాప్ కొట్టారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అంతలోపు సినిమాలో తమ పాత్రకి తగ్గట్టుగా ప్రత్యేకంగా సన్నద్ధమవుతారు. అయితే, ఆ సినిమా పట్టాలెక్కడానికి ఇంకా రెండు నెలల సమయ ముంది.
దీంతో ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం కోసం మరిన్ని కథల్ని వింటున్నారని సమాచారం. ఎన్టీఆర్ కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ ఓ కుటుంబ కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అన్నీ కుదిరితే ఈ సినిమా పక్కా అయ్యే అవకాశాలు ఉన్నాయని, ఫిల్మ్ వర్గాల సమాచారం. అయితే, ఈ సినిమా పక్కా అయినా కూడా త్రివిక్రమ్ సినిమానే ముందుగా సెట్స్‌పైకి వెళ్లనుంది. త్రివిక్రమ్ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్. టబు కూడా ఓ కీలక పాత్రధారి.