ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకు పాదయాత్రను మొదలుపెట్టిన గొప్పవ్యక్తి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అని కడప జిల్లా అధ్యక్షులు అమర్ నాథ్ రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆ మహానేత అడుగుజాడల్లోనే ఆయన తనయుడు, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల కోసం ప్రజా సంకల్ప పాదయాత్రకు శ్రీకారం చుట్టారన్నారు. సీఎం కుర్చీలో కూర్చుని మూడున్నరేళ్లు గడుస్తున్నా.. చంద్రబాబు ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపాన పోలేదు. తమ సమస్యలు తీరాలంటే వైఎస్ జగన్ సీఎం కావాలని, వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఆయనదే విజయమని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. జనసంద్రమైన ఇడుపులపాయ జగన్ పాదయాత్ర కు స్వాగతం పలుకుతూ.. నీ వెంట మేమున్నాం అంటూ ప్రేమ తో ప్రజలు వేస్తున్న పువ్వుల రోడ్లు ఎంత బాగున్నాయో చూడండి… !!! పాదయాత్ర కోసం పూలతొ రోడ్డుని అలంకరించిన పులివెందుల అభిమానులు
