ఒకే రోజు వ్యవధిలో రెండు చోట్ల చైన్ స్నాచింగ్ లు జరిగాయి. ఈ స్నాచింగ్ సంఘటనతో మహిళా లోకం ఉలిక్కి పడింది. క్రిస్టియన్ కాలనీ,ఫరూక్ నగర్ ప్రాంతంలో ఈ చైన్ స్నాచింగ్ జరిగాయి. ఇక్కడ చైన్ స్నాచింగ్ కేసులు నమోదైన సంఘటనలు చాలా అరుదు.గతంలొ ఇలా జరిగితే అప్పట్లో పోలీసులు నిందితులను చాకచక్యంతో పట్టుకున్నాక మళ్ళీ ఈ పీడ ఇప్పుడు మొదలయ్యింది. స్నాచింగ్ లను అరికట్టేందుకు, చైన్ స్నాచర్లను పట్టుకునేందుకు షాద్ నగర్ పోలీసులు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేశారు. ఈజీ మనీ కోసం యువత పెడదారి పడుతున్నారు. గొలుసు దొంగల కోసం స్థానిక పోలీసులు వేట ప్రారంభించారు. చైన్ స్నాచర్లు మొదటగా ఒక బైక్ ను చోరీ చేస్తారు. ఆ బైక్ పై వెళ్లి…చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతారు. లోకల్ వాళ్లతో పరిచయాలు ఉన్నాయా ? లేదా పక్కన పెడితే వీరు హైదరాబద్ నుండి ఇలా సమీపంలోనీ పట్టణాలను టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది.
ఎక్కువగా బీహార్ కు చెందిన దుండగులు హైద్రాబాద్ నగరంలో చైన్ స్నాచర్లకు పాల్పడుతున్నారనీ అప్పట్లో పోలీస్ శాఖ గుర్తించింది. గతంలో రంగారెడ్డి జిల్లా మల్కాజ్ గిరి, ఎల్ బి నగర్ లో చైన్ స్నాచింగ్ ఘనటలు చాలానే జరిగాయి. చైన్ స్నాచింగ్ లను అరికట్టేందుకు ప్రత్యేక టీమ్ లకు సైబారాబాద్ అప్పటి కమిషనర్ సీవీ ఆనంద్ శిక్షణ ఇచ్చారు. తాజాగా షాద్ నగర్ లొ కూడా అలాంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో ఈ జాడ్యం కనిపెట్టడం కోసం షాద్ నగర్ ఇన్స్పెక్టర్ రమేశ్ బాబు సరికొత్త ఆలోచన ప్రవేశ పెడుతున్నారు.
దొంగతనాలు,అసాంఘిక శక్తుల అరాచకానికి అడ్డుకట్ట వేసే క్రమంలో ప్రజల భాగస్వామ్యానికి చేయి అందిస్తుండటం విశేషం.ప్రజలు,ముఖ్యంగా యువతను చైన్ స్నాచర్లను రెడ్ హ్యాండేడ్ గా పట్టుకునేందుకు మంచి బహుమతులు ప్రకటిస్తున్నారు.ఓ వైపు సామాజిక భాద్యతను గుర్తు చేస్తూ మరోవైపు అసాంఘిక శక్తులను తుదముట్టించేందుకు కృషి మొదలు పెట్టారు.ఇంకా చైన్ స్నాచర్లు రెచ్చిపోయే అవకాశం ఉంది కాబట్టి పట్టణంలో పోలీసు గస్తీ ముమ్మరం చేశారు.
యువత,ప్రజల సహకారము ద్వారా స్నాచర్లను పట్టుకునేందుకు రంగం సిద్దం చేశారు.స్నాచర్లను పట్టుకున్న వారికి ప్రత్యేక బహుమతి ఇవ్వడం కోసం సిఐ నజరానా ప్రకటించారు.సామాజిక భాద్యతను యువతరానికి గుర్తు చేస్తున్నారు.ప్రతి మహిళా స్నాచర్ల బారి నుండి జాగ్రత్తగా ఉండాలి అని పోలీసులు సూచిస్తున్నారు.ఒంటరి మహిళలను రోడ్లపై,గల్లీలల్లో టార్గెట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉండటం చేత వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని అనుమానం ఉన్న వ్యక్తుల సమాచారం,వారి కదలికలను ప్రజలు పసిగట్టి పోలీసులకు ఫొన్ నంబర్ 9440795741 ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని పొలీసు శాఖ వారు కోరుతున్నారు.