గుడివాడ వైసిపి ఎమ్మెల్యే కొడాలి నాని మళ్లీ పంచ్ డైలాగ్ లు వాడారు. ఇడుపుల పాయలో ప్రజా సంకల్ప యాత్ర ఆరంభం సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ జగన్ పాదయాత్రను ఆశీర్వదించడానికి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారని, వారందరికి ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.ఇదే తరుణంలో ఆయన ఒక డైలాగ్ వేశారు. ‘పాదయాత్ర అంటే గుర్తుకొచ్చే పేరు వైఎస్. పెద్దపులి లాంటి వైఎస్‌ను చూసి ఓ నక్క పాదయాత్ర చేసింది. అని ఆయన విమర్శించారు. వైఎస్ పేదలకు న్యాయం చేయాలని చెప్పి పాదయాత్రను చేపట్టారని ఆయన అన్నారు. అనేక స్కీములను ఆయన తద్వారా తీసుకు వచ్చారని ఆయన చెప్పారు.పేదలను పెద్ద ఆస్పత్రులకు తీసుకు వెళ్లిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిదని నాని అన్నారు. ఆయన్న చూసి పాదయాత్ర చేసిన బాబు.. పగలంతా బస్సులో పడుకుని రాత్రి నడిచారని వ్యాఖ్యానించారు.
