ప్రముఖ హీరో విక్రమ్ కుమార్తె అక్షిత వివాహం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి ముని మనవడు మనురంజిత్‌తో జరిగిన సంగతి తెలిసిందే. అక్టోబరు 30న చెన్నై గోపాలపురంలోని కరుణానిధి నివాసంలో ఈ వివాహం జరిగింది. ఆదివారం ఈ పెళ్లి రిసెప్షన్‌ను పాండిచ్చేరిలోని సంఘమిత్ర కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు.
అంతేకాదు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల నుంచి దాదాపు 3 వేల మంది విక్రమ్ అభిమానులు ఈ రిసెప్షన్‌కు విచ్చేశారట. అభిమాన నటుడు తమని ఆహ్వానించడంపై ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఈ వేడుకలో అభిమానుల కోరిక మేరకు విక్రమ్ ‘హో బటర్‌ఫ్లై’ అనే పాటను పాడారు. విక్రమ్ నుంచి దీన్ని వూహించని అతిథులు ఒక్కసారిగా సర్‌ప్రైజ్ అయ్యారట. రంజిత్, అక్షిత గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. 2016లో వీరి నిశ్చితార్థం జరిగింది.
