విమానంలో భర్తతో గొడవపడుతూ ఓ వివాహిత చేసిన గోలతో ఏకంగా విమానాన్నే మళ్లించాల్సి వచ్చింది. వివరాల్లోకెళితే.. ఇరాన్‌కి చెందిన ఓ మహిళ తన భర్తతో కలిసి బాలికి వెళ్తున్న ఖతార్ ఎయిర్‌వేస్‌కి చెందిన విమానం ఎక్కింది.
విమానంలో భర్త నిద్రపోతుండగా మహిళ తన భర్త ఫోన్ తీసి అన్‌లాక్ చేసి చూసింది. అప్పటికే తాగి ఉన్న ఆమె భర్త ఫోనులో వేరే యువతుల సంభాషణలు, ఫొటోలు ఉండడం చూసి అందరి ముందు విమానంలో రచ్చ చేసేసింది. ఆమెను అదుపు చేసేందుకు విమాన సిబ్బంది ఎంత ప్రయత్నించినా వారి తరం కాలేదు.
ఎంత చెప్పినా ఆమె వినిపించుకోకపోవడంతో ఇక పైలట్ విమానాన్ని చెన్నైకు మళ్లించాడు. మహిళని ఆమె భర్తని విమానం దించి ఎయిర్‌పోర్ట్‌అధికారుల వద్దకు తీసుకెళ్లారు. ఆ తర్వాత విమానాన్ని తిరిగి బాలికి మళ్లించారు. మహిళ పరిస్థితి కుదుటపడగానే వారిని వేరే విమానంలో పంపారు.
