మంత్రాలు చేస్తున్నారనే నెపంతో అయిదుగురు మహిళలను దారుణంగా హింసించారు. చెట్టుకు కట్టేసి ఒకరి తర్వాత ఒకరు వంద మంది వరకూ తీవ్రంగా కొట్టారు. ఈ అమానవీయ ఉదంతం ఒడిషాలో చోటు చేసుకుంది. మయూర్‌బంజ్ జిల్లాలో బాదసాహి పరిధిలోని మధుపూర్ గ్రామంలో జరిగిన ఈ ఉదంతం.. ఆ రాష్ట్రంలో సంచలనానికి కారణమైంది. పట్టపగలే మహిళలను బంధించి దాడి చేస్తుండగా చాలా మంది ప్రేక్షక పాత్ర వహించారు. కొంత మంది ఆ దారుణాన్ని తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో.. అది కాస్త వైరల్‌గా మారింది.
మంత్రాల నెపంతో వ్యక్తులపై దాడులు ఒడిషాల ఇటీవల తరచూ జరుగుతున్నాయి. బెతనాటిలోని బారామెల్ చాక్‌లో కొద్ది రోజుల కిందట ఇలాగే ఓ యువకుణ్ని దారుణంగా కొట్టారు.