ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను నిర్వహించతలపెట్టిన సంగతి విదితమే .జగన్ పాదయాత్రపై వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ స్పందించారు .ఆమె మాట్లాడుతూ ప్రజలందరి సమస్యలను తెలుసుకునేందుకే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేపడుతున్నారని, తన బిడ్డను ఆదరించి.. ఆశీర్వదించాలని ఏపీ ప్రజలను కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అప్పట్లో చేసిన పాదయాత్రను ప్రజల గుండెల్లో దాచుకొని.. ఆయనను ఆదరించారని ఆమె గుర్తుచేశారు. ప్రజలకు వైఎస్‌ఆర్ అందించిన ప్రతి సంక్షేమ పథకం పాదయాత్ర నుంచే పుట్టిందని, సంక్షేమ పథకాల బ్లూప్రింట్‌ను ఆయన పాదయాత్ర నుంచే తయారుచేసుకున్నారని అన్నారు.
అదేవిధంగా ఇప్పుడు పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌ను ఆదరించి.. ఆశీర్వదించాలని, ప్రజా సంక్షేమ కోసం ఆయనకు బ్లూప్రింట్ ఇవ్వాలని వైఎస్ విజయమ్మ అభ్యర్థించారు. పాదయాత్ర సందర్భంగా మీ కొడుకుగా, తమ్ముడిగా, మనవడిగా వైఎస్ జగన్‌ను అక్కున చేర్చుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఇంకా ఏమి అన్నారు అంటే వైఎస్‌ఆర్ పాదయాత్రలో ఎన్నో అంశాలను గమనించారు.పాదయాత్రలోనే ప్రజాసంక్షేమ పథకాల బ్లూప్రింట్ తయారుచేసుకున్నారు.వైఎస్‌ఆర్ అమలు చేసిన ప్రతి పథకం పాదయాత్ర నుంచే పుట్టింది.పాదయాత్ర తర్వాత వైఎస్‌ఆర్ అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.పాదయాత్రలో వైఎస్‌ఆర్ అనేకమందిని కలిశారు..
రైతులు, మహిళలు, వృద్ధుల సమస్యలను ప్రత్యక్షంగా చూశారు.అధికారంలోకి రాగానే బడుగు వర్గాలకు పెన్షన్ నెలానెలా వచ్చేలా చేశారు.అధికారం చేపట్టిన తర్వాత ఉచిత విద్యుత్ ఫైల్‌పైనే తొలి సంతకం చేశారు.పావలా వడ్డీకే రుణాలు, 104, 108, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, అభయహస్తం వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేసి.. ప్రజల గుండెల్లో దేవుడిగా వైఎస్‌ఆర్ నిలిచిపోయారు.వైఎస్‌ఆర్ ఆశయాలు, సంక్షేమ పథకాల అమలు కోసమే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు.ఆరోగ్య శ్రీ పథకం అమలును చూస్తే ఇప్పుడు బాధగా ఉంది.వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుంటే వైఎస్‌ఆర్ ప్రారంభించిన సంక్షేమ పథకాలు ఈరోజు ఉండేవి కావు.హైదరాబాద్‌లో ఆరోగ్యశ్రీ పథకం వర్తించడం లేదు.వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండటం వల్లే వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎంతోకొంత అమలవుతున్నాయి అని ఆమె అన్నారు ..