ఏపీ ప్రతిపక్ష నేత,ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నదని వైసీపీ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. నిన్న శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న సమయంలో ఒక మహిళ చెప్పులేసుకుని జగన్ వెంట వెళ్లారని, ఆలయంలో డిక్లరేషన్ ఇవ్వలేదని ప్రసారమైన వార్తలను ఆయన ఖండించారు.
హిందూ ధార్మిక ఆచారాల పట్ల విశ్వాసం కలిగిన వ్యక్తిగా జగన్ ఎంతో పవిత్రంగా ఆలయాన్ని దర్శించుకున్నారని ఆయన తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘పాదయాత్రకు ముందు శ్రీవారి అనుగ్రహం కోసం తిరుమల వచ్చిన వైఎస్ జగన్‌పై ఎల్లో మీడియా అసత్యకథనాలను ప్రచారం చేయడం సిగ్గుచేటు.
వైఎస్ జగన్‌నుకానీ, దివంగత మహానేత వైఎస్సార్‌ను కానీ టీటీడీ ఏనాడూ డిక్లరేషన్ అడగలేదు. హైందవ ధర్మాల పట్ల వారికి అపార విశ్వాసం ఉంది’’ అని భూమన పేర్కొన్నారు.ధర్మప్రచార పరిషత్‌గా ఉన్న సంస్థను హిందూ ధర్మ ప్రచార పరిషత్‌గా మార్చిన ఘనత మహానేత వైఎస్సార్‌దేనని, దళిత గోవిందం, కల్యాణమస్తు లాంటి పవిత్ర కార్యక్రమాలెన్నో ఆయన హయాంలోనే ప్రారంభమయ్యాయని భూమన గుర్తుచేశారు. వేంకటేశ్వరస్వామి అంటే ఎంతో భక్తిభావం కలిగిన జగన్ పట్ల ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామన్నారు.