సహజంగా మన దగ్గర హీరోయిన్స్ వయసు దాదాపు 35 దగ్గర నిలిచిపోతుంది. ఆ ఏజ్ దాటిన తర్వాత హీరోయిన్ గా కంటిన్యూ కావడం చాలా కష్టం. బాలీవుడ్ లో అయినా కొందరు కనిపిస్తారేమో కానీ.. 40ప్లస్ ఏజ్ వచ్చాక ఒక్కరు కూడా హీరోయిన్ గా కంటిన్యూ కాలేకపోయారు. కానీ పూజా కుమార్ మాత్రం ఈ ట్రెండ్ కు బ్రేక్ వేసి.. హీరోయిన్ గా కెరీర్ కంటిన్యూ చేస్తోంది. కమల్ విశ్వరూపం వంటి చిత్రంతో టాలీవుడ్ ఆడియన్స్ ను బాగానే అలరించింది పూజా కుమార్.
పూజా కుమార్, ఇప్పుడీ భామ వయసు 40 దాటింది. రాజశేఖర్ లేటెస్ట్ రిలీజ్ పీఎస్‌వీ గరుడవేగ చిత్రంలో హీరో భార్య పాత్రలో నటించి మెప్పించింది. ఏజ్ కాస్త ఎక్కువ కావడంతో ఆమెకు వచ్చే రోల్స్ కూడా ఎక్కువగా భార్య పాత్రలే. వాటిలోనే నావల్టీ అంటూ ఏదో ఒకటి చేసేస్తూ కెరీయర్‌ను బాగానే లాక్కొచ్చేస్తోంది. అటు హాలీవుడ్ నుంచి మొదలు పెట్టి.. ఇటు కోలీవుడ్, బాలీవుడ్‌లను కూడా బాగానే కవర్ చేసేస్తోంది.
అసలు ఈ ఏజ్‌లో హీరోయిన్ పాత్రలు రావడమే ఓ విచిత్రం. అలాంటిది ఏజ్‌ను పక్కన పెట్టి ఎక్స్‌ఫోజింగ్ కూడా చేసేయడమంటే చిన్న విషయమేమీ కాదు.
ప్రస్తుతం పీఎస్‌వీ గరుడవేగ కోసం తెగ ప్రమోషన్స్ చేస్తున్న పూజా కుమార్ ఇలా కనిపించేసింది. బ్లాక్ డ్రస్ ఫుల్‌గానే ఉన్నా లోపల వేసిన ట్రాన్స్‌పరేంట్ వేర్ కారణంగా అందాల ప్రదర్శన డోస్ ఎక్కువగానే ఉంది. ఆమె అందాన్ని పట్టించుకోకుండా కొందరేమో ఆ వయసుకు.. ఆ డ్రస్సా! అన్నట్లుగా మాట్లాడుతున్నారు. కానీ గ్లామర్ లవర్స్ మాత్రం పూజా కుమార్ డేరింగ్‌ను తెగ పొగిడేస్తున్నారు. పైగా 40 ఏళ్లు అనే విషయం చెబితే తప్ప చూస్తే అర్థం కాలేదు కదా అన్నది వారి వర్ష. ఎవరి ఒపీనియన్ వారిది. అన్నింటినీ యాసెప్ట్ చేయాల్సిందే కానీ.. నిజంగానే పూజా కుమార్ ధైర్యాన్ని మాత్రం పొగడాల్సిందే. త్వరలో కమల్‌తో కలిసి విశ్వరూపం – 2 చూపించబోతోంది ఈ బ్యూటీ.