తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్ లోని మడ్ ఫోర్డ్ లో గల దోబీఘాట్లో నూతనంగా ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు మల్లారెడ్డి , కంటోన్మెంట్ శాసనసభ్యులు సాయన్న , ఎం బిసి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తాడూరి మాట్లాడుతూ చాకలి వారు సమాజానికి ఎంతో సేవ చేశారు, కానీ గత 60 సం౹౹ కాలంలో ఎన్నో కష్టాలు పడాల్సిన పరిస్థితి వొచ్చిందని తెలిపారు, కానీ మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి రజకుల సంక్షేమానికి 250 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే, అలాగే ఎం బి సి లను గుర్తించి వారి కోసం కూడా 1000 కోట్ల బడ్జెట్ తో ఒక కార్పొరేషన్ ని ఏర్పాటు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారిదే అని తెలిపారు.
కానీ ప్రస్తుత కాలంలో ఎంతో మంది అగ్రకులాల పెట్టుబడిదారులు వీరి వృత్తిలో చొరపడి ఆధునిక పద్ధతులతో డ్రై క్లీనింగ్ సెంటర్లను ఏర్పాటుచేసి వ్యాపారం చేస్తు రజకులకు అడ్డుగా నిలుస్తున్నారని అన్నారు, కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రజకులకు ఆధునిక యంత్రాలను అందించి వారి నైపుణ్యాన్నీ పెంచేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నదని వారు తెలిపారు.
రాబోయే కాలంలో బంగారు తెలంగాణ లో రజకులు వారి పూర్వ వైభవాన్ని తిరిగి పొంది ఆత్మభిమానంతో ఆనందంగా జీవించాలి అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ ఇంచార్జి గజ్జెలు నగేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్, రజక నాయకులు వీర్లపల్లి శంకర్, నెమలి సురేష్, మహిళా నాయకులు రాజేశ్వరి, శేరి మనెమ్మ, స్థానిక నాయకులు, విగ్రహ ఆవిష్కరణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.