తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి.ఈ క్రమంలో రాష్ట్రంలో తుంగతుర్తి అసెంబ్లీ నియోజక వర్గంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. టీడీపీ నాయకులు మోరిశెట్టి ఉపేందర్, దండా వీరారెడ్డి, మీలా చంద్రకళ, ఇందుర్థి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గుంటకండ్ల ముకుందరెడ్డి, కాశీ వెంకటేశ్వర్లుతోపాటు ఆయా పార్టీలకు చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి గులాబి కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్ తోపాటు స్థానిక పలువురు టీఆర్ ఎస్ నేతలు పాల్గొన్నారు.