2019లో టీఆర్ఎస్ దే అధికారమని టీఆర్ఎస్ ను ఏ శక్తి అడ్డుకోలేదని తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు.షాద్ నగర్ నియోజకవర్గంలొని సోలిపూర్,హాజిపల్లి,నాగులపల్లి గ్రామాలకు చెందిన తెలుగుదేశం – కాంగ్రెస్ పార్టీలకు చెందిన సర్పంచ్ రంగయ్య,మాజీ సర్పంచ్ శ్రీశైలం గౌడ్,మాజీ ఎంపిటిసి వెంకటేష్ గౌడ్,ఇస్నాతి శ్రీనివాస్ మరొ రెండు వందల మంది కార్యకర్తలు డిప్యూటీ సీఎం మహమూద్ అలి సమక్షంలో పార్టీలో చేరారు.
తెలుగుదేశం – కాంగ్రెస్ ల నుండి టీఆర్ఎస్ లో చేరికల నేపద్యంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి అందె బాబయ్య,ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ను మహమూద్ అలీ అభినందించారు. షాద్ నగర్ ఈడేన్ గార్డెన్ లో జరిగిన ఈ సభలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ ఇండియాలో నంబర్ వన్ సీఎం కేసీఆర్ అన్నారు.రేవంత్ రెడ్డి నోటుకు ఓటు వ్యవహారం ప్రస్తావన చేశారు.
టిఆర్ఎస్ లో ఇంకా బారి చేరికలు ఉంటాయనీ అన్నారు.మంచి పనులు చేస్తున్న సీఎం ఈ పార్టీ ప్రజలదిగా మార్చారని కేసీఆర్ మీ వారు అంటూ సంబోధన చేశారు.అనేక సంక్షేమ కార్యక్రమాలతో టీఆర్ఎస్ ముందుకు సాగుతుందనీ మిషన్ కాకతీయ అద్భుతమైన పధకం అని బంగారు తెలంగాణ ఖాయం అని అన్నారు.2019లో 90శాతం సీట్లు టీఆర్ఎస్ వేనని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.