ప్రముఖ నటి టబు పేరు చెబితే నిన్నే పెళ్లాడతా చిత్రమే గుర్తుకు వస్తోంది. మరి ఆ చిత్రంలో మన్మథుడు నాగార్జునతో చేసిన రొమాన్స్ ఇప్పటికీ మర్చిపోలేరు. తెలుగులో వరుసగా చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ తదితర అగ్ర హీరోలతో నటించిన టబు.. ఆ తర్వాత కాలంలో బాలీవుడ్‌కి షిప్ట్ అయ్యి అక్కడ హవా కొనసాగించింది.
అయితే ఇన్నాళ్ళ కెరీర్ లో డబ్బు కోసం ఎప్పుడూ పనిచేయ లేదని అంటుంది టబు, ప్పటివరకు నాకు వచ్చిన పాత్రల్లో అన్నీ మంచివే. ఓ సినిమా ఒప్పుకునే ముందు నాకు డబ్బుతో పాటు తనకు పేరు వస్తుందా లేదా అనేది ఆలోచిస్తానని.. అది చాలా ముఖ్యమని చెప్పింది. డబ్బు ఇస్తున్నారు కదా అని ఏది పడితే అది చేయను. ఆవిషయంలో ఎవ్వరికీ భయపడను అని చెప్పుకొచ్చింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలిగే ధైర్యం నాలో ఉంది అని చెప్పుకొచ్చారు టబు.