తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇమేజ్ టవర్ నిర్మాణానికి ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగిస్తూ.. ఇమేజ్ టవర్ హైదరాబాద్‌కు మరో మైలురాయి కానుందన్నారు.యానిమేషన్-వీఎఫ్‌ఎక్స్-గేమింగ్ హబ్‌గా తెలంగాణను తీర్చిదిద్దనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటామన్నారు. యానిమేషన్-గేమింగ్ రంగాల్లో రాష్ర్టాన్ని ప్రపంచస్థాయి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. యానిమేషన్ పరిశ్రమలకు పలు రాయితీలు ఇస్తున్నట్లు చెప్పారు. వైబ్రంట్ ఐటీ సెక్టార్‌గా తెలంగాణ రూపుదిద్దుకుంటోందన్నారు. ఇప్పటికే 30 వేల మందికి ఉపాధి కల్పిస్తూ గేమింగ్, యానిమేషన్ సంబంధిత రంగాల్లో 100కు పైగా కంపెనీలు హైదరాబాద్‌లో పనిచేస్తున్నాయన్నారు. యానిమేషన్-గేమింగ్-విజువల్ ఎఫెక్ట్ ఇండ్రస్ట్రీకి మంచి భవిష్యత్ ఉందని మంత్రి తెలిపారు.
Minister @KTRTRS addressing the gathering after laying foundation stone for IMAGE Tower at Raidurgam pic.twitter.com/Y91rP22vns
— Min IT, Telangana (@MinIT_Telangana) November 5, 2017
బాహుబలి, ఈగ, అరుంధతి, మగధీర, లైఫ్ ఆఫ్ పై వంటి విజువల్ ఎఫెక్ట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలు హైదరాబాద్‌లో రూపుదిద్దుకున్నాయన్నారు. యానిమేషన్-గేమింగ్ ఇండ్రస్ట్రీతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని.. డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. ఈ క్రమంలో భాగంగానే విద్యార్థుల్లో నైపుణ్యతను పెంచేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో ఇమేజ్ టవర్ నిర్మాణం. T నమూనాలో ఇమేజ్ టవర్ నిర్మాణం చేపడుతున్నట్లు T అంటే తెలంగాణ.. T అంటే టెక్నాలజీ అన్నారు. మూడేళ్లలో ఐకానిక్ నగరంగా హైదరాబాద్ మారుతుందని మంత్రి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ ఛైర్మన్ బాలమల్లు, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
T for Technology
T for TelanganaThe 4 towers are symbolic of the transition of the city of 'Char Minar' to a vibrant new age metropolis pic.twitter.com/8zus5Sg5vh
— KTR (@KTRTRS) November 5, 2017