బొమ్మరిల్లు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన సిద్దార్థ్ చాలా కాలం తర్వాత హీరోగా నటించిన అవళ్ చిత్రాన్ని తెలుగులో గృహం పేరుతో డబ్ చేస్తున్నారు. ఈనెల 3న తమిళ్ లో రిలీజ్ అయ్యింది.. అయితే సినిమా రిలీజ్ అయి ఒక్క రోజు కాలేదు వెంటనే సినిమా మొత్తం పైరసి చేసి నెట్‌లో పెట్టేసారు. ఇంకేముంది కొత్త సినిమా పైగా హర్రర్ దానికి తోడు మంచి క్వాలిటీ తో ఉంది దాంతో సిద్దార్థ్ సినిమాకు అన్యాయం జరుగుతోంది.
సినిమా మొత్తం పైరసి కావడంతో ఏమిచెయ్యాలో తెలీక తలపట్టుకున్నాడు సిద్దార్థ్ . ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పైరసి మాత్రం ఆగడం లేదు. ఇక ఈ చిత్రాన్ని తమిళం తో పాటుగా తెలుగులో కూడా నవంబర్ 3నే రిలీజ్ చేయాలనీ అనుకున్నారు.. కానీ తెలుగులో అదే రోజున మరో మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నందున తన సినిమాని వాయిదా వేసుకున్నాడు. కట్ చేస్తే ఇప్పుడు పైరసీ అయ్యింది దాంతో మరింతగా నష్టపోవడం ఖాయం.. అయితే గుడ్డిలో మెల్ల ఏంటంటే సిద్దార్థ్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం.