టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్- రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం రంగస్థలం 1985. ఈ సినిమాలో చెర్రీకి జోడీగా సమంతా నటిస్తోంది. అనసూయ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తుంది. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీశ్రీప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు. ఈ సినిమా పాటలు ఇంకా విడుదల కాలేదు. కానీ రామ్‌చరణ్ మాత్రం ఈ చిత్రంలోని పాటలను హీరోమంచు మనోజ్‌కు వినిపించారట. ఆ పాటలు విన్నప్పటి నుండి మనోజ్‌ను రంగస్థలం పాటలు వెంటాడుతున్నాయట.
దీంతో వెంటనే సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాడు మనోజ్. నా బ్రదర్ రామ్ చరణ్ రంగస్థలం పాటలు వినిపించినప్పటి నుంచి అవి నన్ను వెంటాడుతున్నాయి. ఆడియో, సినిమా విడుదల కోసం చాలా ఎదురుచూస్తున్నాను అని ట్వీట్ చేశారు. అంతేకాదు మనోజ్ పెట్టిన ట్వీట్ చూసిన ఓ అభిమాని రామ్ చరణ్ గురించి ఒక్కమాటలో చెప్పన్నా అని అడిగాడు. ఇందుకు మనోజ్ బంగారం అని సమాధానమిచ్చారు. దీంతో మెగా అభిమానులు మనోజ్‌కు ధన్యవాదాలు చెబుతున్నారు. ఇక మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాని వేసవిలో విడుదల చేసేందుకు ఆ చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.