వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ తక్కుక కాలంలోనే టాప్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది. తెలుగులో ఒకరిద్దరు తప్ప ప్రస్తుతం వున్న టాప్ హీరోలు అందరితోను నటించేసిన రకుల్.. సినిమాలు అయితే చాలానే చేసింది కానీ సక్సెస్ రేట్ మాత్రం తక్కువనే చెప్పాలి. ఇక ఈ ఏడాదిలో రకుల్ ప్రీత్ సింగ్‌కి రారండోయ్ వేడుక చూద్దాం తప్ప మరో విజయం లేదు.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో విన్నర్, డైరెక్టర్ బోయపాటి శీనుతో జయ జానకి నాయక, మహేష్ బాబుతో స్పైడర్‌లాంటి ఫ్లాప్‌లు రకుల్‌ని ఒక్కసారిగా రేసులో వెనక్కి నెట్టాయి. ప్రస్తుతం టాప్‌కి చేరుకునేంత వేగంగా దూసుకొస్తోన్న హీరోయిన్లు ఎవరూ లేకపోయినా.. రకుల్‌కి మాత్రం అవకాశాలు తగ్గాయి అనేది వాస్తవం. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేకపోవడం గమనార్హం.
టాలీవుడ్ గత క్యాలెండర్ ఇయర్‌లో టాప్ హీరోల సినిమాల్లో నటిస్తూ యమ బిజీగా వున్న రకుల్‌కి క్యాలెండర్ తిరిగే సరికి సీన్ రివర్స్ అయింది. ప్రస్తుతానికి తనకి త్రెట్ అనిపించే యువ హీరోయిన్లు లేకపోవడంతో తనకి మళ్లీ బూమ్ వస్తుందని రకుల్ ఆశిస్తోంది. సమంతకి పెళ్లయిపోవడం కూడా ఆమెకి కలిసొచ్చే పాయింటే.. అయినా రకుల్ తిరిగి సక్సెస్ ట్రాక్‌లోకి రాకపోతే మాత్రం నిర్మాతలు తనని కన్సిడర్ చేసే అవకాశాలు తక్కువే అంటున్నారు సినీ విశ్లేషకులు.