సీనియర్ హీరో రాజశేఖర్.. ఈ హీరో సరైన హిట్టు కొట్టి చాలా కాలం అయిపోయింది. ఎంతకాలం అంటే రాజశేఖర్ ఇమేజ్ ఏంటో కూడా ఈ తరానికి పెద్దగా తెలియకుండా పోయింది. గత పదిహేను సంవత్సరాల్లోనే రాజశేఖర్ కెరీర్ లో ఒక్కటంటే ఒక్క సూపర్ హిట్ కూడా లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
రాజశేఖర్ కెరీర్ లో చివరి సూపర్ హిట్ ఏది అంటే.. సింహరాశి అని చెప్పాలి. 2001లో వచ్చిన ఈ సినిమ హీరోగా రాజశేఖర్ కు మంచి హిట్టుగా నిలిచింది. ఇక ఆ తర్వాత వరుస ప్లాపులతో హిట్టుకోసం మొహం వాచి పోయి ఉన్న రాజశేఖర్‌కు పీఎస్‌వీ గరుడవేగ ఊరటగానే కనిపిస్తోంది. నవంబర్ 3న రిలీజ్ అయిన గరుడ వేగ హిట్ టాక్ తెచ్చుకుంది.
గురడవేగ చిత్రానికి అంతటా పాజిటివ్ రివ్యూలే వస్తున్నాయి. రాజశేఖర్ అండ్ కో కి ఉత్సాహాన్ని ఇచ్చే రేటింగులే కనిపిస్తున్నాయి. ప్రేక్షకుల నుంచి కూడా పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ సినిమా ఆకట్టుకునే యాక్షన్ థ్రిల్లర్ అనే టాక్ వినిపిస్తోంది. బాక్సాఫీసు వద్ద కూడా ఈ సినిమాకు మరీ అంత టఫ్ పోటీ లేదు. దీంతో ఫుల్ ఖుషీగా ఉన్నాడు రాజశేఖర్.
ఇక మరో యువ హీరో సిద్దార్థ్ కు కూడా హిట్ సినిమా లేక 5 ఏళ్ల పైనే అవుతోంది . అయితే తెలుగులో హిట్ లేక పదేళ్లు అవుతోంది ఇతడికి కూడా తమిళంలో ఏదో ఒకటి అరా హిట్స్ అయ్యాయి కానీ తెలుగులో మాత్రం హిట్ లేక పదేళ్లు అవుతోంది. అయితే లక్కీగా ఈ హీరోకు కూడా నవంబర్ 3నే అదృష్టం కలిసి వచ్చింది. తమిళంలో నవంబర్ 3న అవళ్ చిత్రం రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
అయితే అదే రోజున తెలుగులో కూడా రిలీజ్ కావాల్సి ఉంది కానీ అదే రోజున మూడు సినిమాలు రిలీజ్ అవుతుండటంతో సిద్దార్థ్ గృహం సినిమాని వాయిదా వేసాడు. మరి తెలుగులో ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి . మొత్తానికి ఈ ఇద్దరు హీరోలకు చాలాకాలం తర్వాత హిట్స్ రావడంతో మరోసారి ట్రాక్ ఎక్కేశారని సినీ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.