టాలీవుడ్ మన్మథుడు నాగార్జున రెండో తనయుడు అఖిల్ మాస్ వి వి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అఖిల్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అయితే ఆ చిత్రం భారీ డిజాస్టర్ అయింది. అఖిల్ తన పెర్ఫార్మన్స్ పరంగా కూడా జనాలని ఆకట్టుకోలేకపోయాడు. అయితే అఖిల్ సినిమాలో అఖిల్ ప్రతి దాంట్లో వేలు పెట్టాడని అందుకే సినిమా డిసాస్టర్ అయ్యిందనే టాక్ ఉంది.అఖిల్ చాలా గ్యాప్ తీసుకుని అక్కినేని ఫ్యామిలీకి జీవితాంతం గుర్తుండిపోయే మనం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన విక్రమ్ కె కుమార్ డైరెక్షన్‌లో హలో అనే సినిమాలో నటిస్తున్నాడు.
అయితే ఈ సినిమాలో కూడా అఖిల్ అన్నింట్లో వేలు పెడుతున్నాడని..అఖిల్ జోక్యం ఎక్కువ అవుతున్నందుకు దర్శకుడు విక్రమ్ కె కుమార్ చిరాకు పడుతున్నాడట. అఖిల్ గురించి నాగార్జునకి కూడా కంప్లెయింట్ కూడా చేసాడంట విక్రమ్. అయితే నాగార్జున కూడా అఖిల్ పై సీరియస్ గా ఉన్నాడని తెలుస్తుంది. అన్ని విషయాల్లో వేలు పెడితే ఈ సారి కూడా సినిమా ఫ్లాప్ అవుతుందని అఖిల్‌కి వార్నింగ్ ఇచ్చాడట నాగార్జున. రెండో సినిమాకే అఖిల్ ఇలా అన్నింటిలో వేలుపెడితే ముందు ముందు కష్టమేమో అని అంటున్నారు తెలుగు సినీ జనాలు చర్చించుకుంటున్నారు.