టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాలో తాను పోషించిన పాత్రను, నిజ జీవితంలోనూ కొనసాగిస్తున్నాడు. ఊరిని దత్తత తీసుకోవడమంటే కేవలం ప్రచారానికి పరిమితం కాకుండా తనవంతు సాయం అందించి రియల్ శ్రీమంతుడు అనిపించుకుంటున్నాడు మన ప్రిన్స్ మహేశ్‌బాబు. 99 మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్ చేయించి 99 కుటుంబాల హృదయాల్లో నిలిచిపోయాడు.
విజయవాడ లోని ఆంధ్ర హాస్పిటల్ సౌజన్యంతో మహేష్ బాబు 99 మందికి హార్ట్ ఆపరేషన్ చేయించాడు. ఇప్పటికే గుంటూరు జిల్లా లోని బుర్రిపాలెం గ్రామాన్ని మహేష్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఆ గ్రామంలో హెల్త్ క్యాంప్ పెట్టి అందరికీ పరీక్షలు చేయించి అవసరమైన వాళ్లకు మందులను ఇప్పించాడు అలాగే పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి కూడా పూనుకున్నాడు.
గుంటూరు ఎంపీగా మహేష్ బావ గల్లా జయదేవ్ ఉన్నాడు కాబట్టి అతడి సహాయ సహకారాలతో మహేష్ ఈ పనులను చేస్తున్నాడు. మహేష్ మీద ఉన్న అభిమానంతో ఆసుపత్రి యాజమాన్యం కూడా చిన్నారులకు ఆపరేషన్ చేయడానికి ముందుకు వచ్చింది. మొత్తానికి మహేష్ వల్ల 99 మంది చిన్నారులు సంతోషంగా ఉన్నారు. ఇక ప్రస్తుతం మహేష్ భరత్ అనే నేను చిత్రాన్ని చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వేసవిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.