అర్జున్ రెడ్డి చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రంలో నటించిన నటీనటులు, దర్శకుడు తోపాటు టెక్నీషియన్స్ కూడా బిజీ అయిపోయారు. ఇక ఆ చిత్రంలో సినిమాలో పాటలు రాసిన గేయరచయితలు కూడా బిజీ అయిపోతున్నారు. అందులో మధురమే ఈ క్షణమే అంటూ సాగే ఓ పాట గుర్తుందిగా.. ఆ పాటని రాసింది శ్రేష్ఠ అనే ఫీమేల్ రైటర్.
ఇక శ్రేష్ఠ గురించి చెప్పుకోవాలంటే ఆమె ప్రయాణం సులువుగా మొదలవలేదు.సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుందో అందరికీ తెలిసిందే. సినీ ప్రపంచం లోకి కొత్తగా అడుగు పెట్టిన శేష్ఠకి కూడా అలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయాట. గ్లామర్ ప్రపంచంలో అబ్బాయిలని మాత్రమే కాదు.., అమ్మాయిలని కూడా నమ్మడానికి వీల్లేదు అంటోంది శ్రేష్ఠ.
అసలు విషయం ఏంటంటే.. టాలీవుడ్ ఓ లేడి డైరెక్టర్ శ్రేష్ఠని గోవాకి రమ్మని పదే పదే ఫోన్ చేసిందట. గోవా వస్తే ఇక్కడ ఒక సర్ ప్రైజ్ ఉందని, ఓ అబ్బాయి నీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నాడని పదే పదే స్ట్రెస్ చేసేసరికి తప్పని పరిస్థితిలో వెళ్ళిందట శ్రేష్ఠ. అక్కడికి వెళ్ళేసరికి, అసలు తనని ఇంతవరకు కలవని అబ్బాయి అలాంటి కోరిక కోరడంతో ఖంగు తినిందట ఈ లిరిక్ రైటర్.
దీంతో ఒక లేడి డైరెక్టర్ అంతా తెలిసి.. ఓ అమ్మాయిని ఇలా ప్రమాదంలో పడేయటం ఏంటని ఆశ్చర్యపోయినా, ఆ తరువాత ఇండస్ట్రీ చెడ్డ వారు కేవలం మగవారే కాదని తెలుసుకుంది. ఇక ఆ లేడీ డైరెక్టర్ ఎవరో కాదు, మొదటి సినిమాతోనే ఓ యువ క్రేజీ హీరోతో బ్లాక్ బస్టర్ అందుకోని, ఆ తరువాత వరుస ఫ్లాపులు ఇచ్చిన డైరెక్టర్ అని నెటిజన్లు గెస్ చేస్తున్నారు. అయితే ఓ ప్రముక చానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన శ్రేష్ఠ మాత్రం
ఆ లేడీ డైరెక్టర్ పేరు బయటపెట్టకుండా ఈ విషయాలు చెప్పుకుంటూ వచ్చింది.