ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు నీరజ్ పాండే ఎమ్ ఎస్ ధోనీ- ద అన్‌టోల్డ్‌స్టోరీ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇక ఆ చిత్రంలో ధోనీ ప్రేయసిగా దిశాపటానీ నటించగా ధోనీ భార్య సాక్షి పాత్రలో కైరా అద్వాని నటించిన సంగతి తెలిసిందే.
కైరా అద్వాని కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ సరసన భరత్ అను నేను చిత్రంలో నటించే లక్కీ చాన్స్ దక్కించుకుంది. అయితే ఇక ఇటీవల కైరా ఓ ఇంటర్వ్యూలో ధోనీ పై తనకు ఉన్న క్రష్‌ని బయట పెట్టింది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా రిపోర్టర్ మీకు ఎవరితో కలిసి బైక్ రైడింగ్‌కు వెళ్లాలని ఉందని అడగ్గా ఆమె ఏమాత్రం తడుముకోకుండా ధోనీ పేరు చెప్పింది. ధోనీకి బైకులంటే ఎంతిష్టమో అందరికీ తెలుసు. రాంచీలో ధోనీ తన ఇంట్లో బైక్‌ల కోసం ప్రత్యేక గ్యారేజీ కూడా ఏర్పాటు చేసుకున్నాడని చెప్పుకొచ్చింది.