డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వరుస ప్లాపులతో దూసుకుపోతున్నాడు. పూరీ దర్శకత్వంలో సినిమాలు చేయడానికి టాప్ హీరోలందరూ మొహం చాటుతున్నారు. దీంతో తన కుమారుడు ఆకాష్ హీరోగా ఒక లవ్ స్టోరీని స్టార్ట్ చేశాడు పూరీ. మెహబూబా పేరుతో ఓ సరిహద్దు ప్రేమకథను సెలక్ట్ చేసుకున్నాడు. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంది.
అయితే తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లో భారీ షెడ్యూల్ పూర్తిచేసిన యూనిట్.. ఇప్పుడు పంజాబ్‌కు షిఫ్ట్ అయింది. ఈ సినిమాకి ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న ఛార్మీది కూడా పంజాబ్ కావడం విశేషం. ఇండియా – పాకిస్థాన్ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. 1971లో ఇండో – పాక్ వార్ జరిగింది. అప్పుడు నడిచిన ఓ ప్రేమకథ ఇది. పిరియాడిల్ సినిమా చేయడం పూరికి ఇదే తొలిసారి. మరి ఈ సినిమాపూరికి ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో చూడాలి.