గరుడవేగ ఈ చిత్రాన్ని హీరో రాజశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎంతో చమటోర్చి షూటింగ్‌ను ఫినిష్ చేశారు. మొత్తానికి ప్రజల ముందుకొచ్చి అందరి నోట బ్లాక్ బస్టర్ అనే టాక్‌ను సొంతం చేసుకున్నారు. ఏది ఏమైనా ఈ సబ్జెక్ట్ నిజంగా ఎంతో మంది స్టార్ హీరోల దగ్గరకు తిరిగిందని, ఈ సబ్జెక్ట్ గురించి చెప్పినా.. స్టార్ హీరోలు అంతగా పట్టించుకోలేదని సమాచారం. కొంత మంది స్టార్లు ఆ సమయంలో ఈ సబ్జెక్ట్‌ను సీరియస్‌గా తీసుకుని ఉంటే.. ఈ బ్లాక్ బస్టర్ తమ ఖాతాల్లో పడి ఉండేదని కొంత మంది స్టార్లు ఇప్పుడు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
దర్శకుడు ప్రవీణ్ సత్తార్ గరుడవేగ సబ్జెక్ట్‌ను మొదట తయారు చేసుకున్న వెంటనే బాలకృష్ణకు కూడా చెప్పినట్లుగా సమాచారం ఉన్నా.. దాన్ని అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు. ఈ గరుడవేగ సబ్జెక్ట్‌ను మొదట బాలకృష్ణ కోసమే తయారు చేశాను అన్నట్లుగా ప్రవీణ్ సత్తార్ ఓ ప్రెస్ మీట్లో తన సన్నిహితులతో చెప్పారు. మొదటగనుక బాలకృష్ణ ఈ సినిమాను ఒప్పుకున్నట్లయితే గరుడవేగ బ్లాక్‌బస్టర్‌ను బాలకృష్ణ అకౌంట్లో పడి ఉండేది.
కానీ గరుడవేగ కథను అంతగా పట్టించుకోకపోవడంతో అటు తిరిగి.. ఇటు తిరిగి రాజశేఖర్ వద్దకు చేరింది. దీంతో ఇన్ని సంవత్సరాల అనంతరం గరుడవేగతోఓ మంచి బ్లాక్ బస్టర్‌ని సొంతం చేసుకున్నారు హీరో రాజశేఖర్. మొదట్నుంచే సబ్జెక్ట్‌ను నమ్మి.. కష్టపడి రాజశేఖర్ ఎమోషనల్స్ సీన్స్, అలానే హీరో క్యారక్టరైజేషన్ను చాలా బాగా పండించారని, రాజశేఖర్ నెక్స్ట్ లెవెల్ ఫర్మామెన్స్ చేశారని, అందులోనూ.. క్లాస్ మాస్ తేడా లేకుండా అందరికీ ఎటువంటి పరిస్థితుల్లోనూ నచ్చి తీరేలా అన్ని ఎమోషన్స్, సీన్స్ ఈ గరుడ వేగలో ఉన్నాయని సినీ అభిమానుల టాక్.