అదేమీ టైటిల్ పెద్ద కొడుకు సీఎం కేసీఆర్ ..చిన్న కొడుకు ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట అసెంబ్లీ నియోజక వర్గ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అరూరి రమేష్ ఏమిటి అని ఆలోచిస్తున్నారా .ఇది మేము చెప్పిన మాట కాదు .ఏకంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ స్వయంగా అన్న మాట .
అసలు విషయం ఏమిటి అంటే ఐనవోలు మండలంలో సింగారం ,ముల్కలగూడెం ,కొండపర్తి ,వనమాల కనపర్తి గ్రామాల్లో అర్హులకు కల్యాణ లక్ష్మీ చెక్కులు మొత్తం ఇరవై ఒక్కమందికి ఇంటింటికి వెళ్లి మరి అందజేశారు .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరూరి మాట్లాడుతూ పెద్దకొడుకు కేసీఆర్ పంపారు .చిన్నకోడుకుగా నేను వచ్చాను అంటూ లబ్ధిదారుల ఆశీర్వాదం పొందారు .ఈ క్రమంలో ముల్కలగూడెం లో అవునూరి కొమరమ్మ అనే మహిళ ఎమ్మెల్యే తో మాట్లాడుతూ మాకు అండ ఎవరు లేరని అనుకున్నాం ..నా బిడ్డ పెళ్ళికి మీరు ప్రభుత్వం ద్వారా చేసిన ఆర్ధిక సహాయం మరువలెం అని అన్నారు .